Modi : మోదీ చైనా పర్యటన: సరిహద్దు వివాదాలపై చర్చ

PM Modi to Visit China Next Month for SCO Summit; Border Talks Expected

Modi : మోదీ చైనా పర్యటన: సరిహద్దు వివాదాలపై చర్చ:భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు చైనాలోని తియాంజిన్‌లో జరగనుంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

గల్వాన్ తర్వాత తొలిసారి చైనాకు ప్రధాని మోదీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెలలో చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు చైనాలోని తియాంజిన్‌లో జరగనుంది. ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీని కోసం మోదీ ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో చైనాకు వెళ్తారని ఆ వర్గాలు తెలిపాయి. లడఖ్ సరిహద్దుల్లో చైనా-భారత సైనికుల మధ్య ఘర్షణ తర్వాత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి అని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

తియాంజిన్ నగరంలో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు SCO సదస్సు జరగనుంది. ఈ సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత్ తరఫున ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తదితరులు పాల్గొంటారు. ఈ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, జిన్ పింగ్‌తో చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇందులో పలు ద్వైపాక్షిక అంశాలతో పాటు సరిహద్దు సమస్యలపైనా చర్చలు జరగనున్నాయి.

ప్రధాని హోదాలో మోదీ తొలిసారిగా 2015లో బీజింగ్‌లో పర్యటించారు. ఆ తర్వాత ఇప్పటివరకు మోదీ మొత్తం ఐదుసార్లు చైనాకు వెళ్లారు. 2020లో గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది, ఇరువైపులా సైనికులు మరణించారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అప్పటి నుంచి ప్రధాని మోదీ చైనాలో పర్యటించలేదు. తాజాగా భారత్-చైనాల మధ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు చర్చలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ బీజింగ్‌కు వెళ్లి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాల గురించి వారు చర్చించారు.

Read Also:DeepakTilak : లోకమాన్య తిలక్ ముని మనవడు, కేసరి పత్రిక ఎడిటర్ దీపక్ తిలక్ కన్నుమూత

 

Related posts

Leave a Comment