PriyaNair : వ్యాపార ప్రపంచంలో దూసుకుపోతున్న ప్రియా నాయర్

Priya Nair: Scripting History as HUL's First Woman CEO

PriyaNair : వ్యాపార ప్రపంచంలో దూసుకుపోతున్న ప్రియా నాయర్:ప్రియా నాయర్.. ప్రస్తుతం ఈ పేరు వ్యాపార ప్రపంచంలో మారుమోగుతోంది. హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) తదుపరి సీఈఓగా, ఎండీగా ఆమె పేరును ప్రకటించడమే దీనికి కారణం. కంపెనీ 92 సంవత్సరాల చరిత్రలో ఒక మహిళ సీఈఓ కావడం ఇదే మొదటిసారి. 

ప్రియా నాయర్: హెచ్‌యూఎల్ చరిత్రలో కొత్త శకం

ప్రియా నాయర్.. ప్రస్తుతం ఈ పేరు వ్యాపార ప్రపంచంలో మారుమోగుతోంది. హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) తదుపరి సీఈఓగా, ఎండీగా ఆమె పేరును ప్రకటించడమే దీనికి కారణం. కంపెనీ 92 సంవత్సరాల చరిత్రలో ఒక మహిళ సీఈఓ కావడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో ప్రియా నాయర్ ఎవరనే ఉత్సుకత మొదలైంది. ప్రస్తుతం HUL సీఈఓగా ఉన్న రోహిత్ జావా పదవీకాలం ఈ నెల 31న ముగుస్తుంది. ఆగస్టు 1న ప్రియా నాయర్ బాధ్యతలు స్వీకరిస్తారు.HULను నడిపించనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించిన ప్రియ, సంస్థ బోర్డులో కూడా చేరనున్నారు. అలాగే, యూనిలీవర్ లీడర్‌షిప్ ఎగ్జిక్యూటివ్ (ULE) సభ్యురాలిగానూ కొనసాగుతారు. ప్రస్తుతం ఆమె యూనిలీవర్‌లో బ్యూటీ అండ్ వెల్‌బీయింగ్ విభాగానికి అధ్యక్షురాలిగా ఉన్నారు.

1995లో HULలో చేరిన ప్రియా నాయర్, హోమ్ కేర్, బ్యూటీ, పర్సనల్ కేర్ వంటి విభాగాల్లో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే, కన్స్యూమర్ ఇన్‌సైట్స్ మేనేజర్‌గానూ పనిచేశారు. సంస్థ కీలక ఉత్పత్తులైన డోవ్, రిన్, కంఫర్ట్ వంటి ఉత్పత్తులకు బ్రాండ్ మేనేజర్‌గానూ వ్యవహరించారు. లాండ్రీ బిజినెస్‌కు నాయకత్వం వహించారు. ఓరల్ కేర్, డియోడరెంట్స్, కస్టమర్ డెవలప్‌మెంట్ విభాగాలను కూడా ఆమె నిర్వహించారు.ప్రియా నాయర్ సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్‌లో అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో బీకామ్ పూర్తిచేశారు. ఆ తర్వాత పూణెలోని సింబయాసిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మార్కెటింగ్‌లో ఎంబీఏ పూర్తిచేశారు. అనంతరం హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్ పూర్తిచేశారు.

Read also:Malaysia : మలేషియా హెలికాప్టర్ ప్రమాదం: ఐదుగురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

 

Related posts

Leave a Comment