Karnataka : ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో పురుషుడి అస్థిపంజరం లభ్యం: హోంమంత్రి జి. పరమేశ్వర ధృవీకరణ:దేశవ్యాప్తంగా కలకలం రేపిన ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జరిపిన తవ్వకాల్లో మనిషి అస్థిపంజరంతో పాటు మరికొన్ని మానవ ఎముకలు లభ్యమైనట్లు కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర అధికారికంగా ధృవీకరించారు.
కర్ణాటకలోని ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం
దేశవ్యాప్తంగా కలకలం రేపిన ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జరిపిన తవ్వకాల్లో మనిషి అస్థిపంజరంతో పాటు మరికొన్ని మానవ ఎముకలు లభ్యమైనట్లు కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర అధికారికంగా ధృవీకరించారు.
గురువారం బెంగళూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసు వివరాలను వెల్లడించారు. “ఒక అజ్ఞాత వ్యక్తి 13 ప్రాంతాల్లో మృతదేహాలను పూడ్చిపెట్టానని ఫిర్యాదు చేశాడు. అతని వాంగ్మూలం ఆధారంగా సిట్ బృందాలు తవ్వకాలు చేపట్టాయి. ఆరో ప్రాంతంలో ఒక పురుషుడి అస్థిపంజరం దొరికింది. దాంతో పాటు మరో కొత్త ప్రదేశంలోనూ కొన్ని ఎముకలు లభ్యమయ్యాయి. దొరికిన అన్ని అవశేషాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (FSL) పంపాము” అని తెలిపారు. 13వ స్థానంలో మాత్రం ఇంకా ఏమీ దొరకలేదని ఆయన పేర్కొన్నారు.
ఫిర్యాదుదారుడు మెజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇస్తూ, తాను వందల సంఖ్యలో మృతదేహాలను పూడ్చిపెట్టానని చెప్పడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకొని సిట్ ఏర్పాటు చేసిందని పరమేశ్వర గుర్తు చేశారు. ఈ దర్యాప్తులో ప్రభుత్వం జోక్యం చేసుకోదని, శాస్త్రీయంగా, సాంకేతిక పరిజ్ఞానంతో నిజానిజాలు తెలుసుకోవడానికి సిట్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ఆయన వివరించారు.
Read also:War2 : వార్ 2′ అప్‌డేట్: హృతిక్, ఎన్టీఆర్ కలిసి స్టెప్పులేసిన ప్రోమో విడుదల!
