Kerala : చిరుత దాడి నుండి కొడుకును కాపాడిన తండ్రి – కేరళలో జరిగిన ఉత్కంఠభరిత ఘటన:కన్న కొడుకు కోసం ఓ తండ్రి ఏదైనా చేస్తాడు అనడానికి నిదర్శనంగా నిలిచింది కేరళలో జరిగిన ఓ సంఘటన. మలక్కపార ప్రాంతానికి చెందిన ఒక తండ్రి, తన నాలుగేళ్ల కొడుకును చిరుత దాడి నుంచి కాపాడుకునేందుకు ఏకంగా దానితోనే పోరాడాడు.
చిరుత దాడి నుండి కొడుకును కాపాడిన తండ్రి
కన్న కొడుకు కోసం ఓ తండ్రి ఏదైనా చేస్తాడు అనడానికి నిదర్శనంగా నిలిచింది కేరళలో జరిగిన ఓ సంఘటన. మలక్కపార ప్రాంతానికి చెందిన ఒక తండ్రి, తన నాలుగేళ్ల కొడుకును చిరుత దాడి నుంచి కాపాడుకునేందుకు ఏకంగా దానితోనే పోరాడాడు.
ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.
మలక్కపారలోని వీరన్‌కుడిలో నివసించే బేబీ, రాధిక దంపతులు తమ కుమారుడు రాహుల్‌తో కలిసి గుడిసెలో నిద్రిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 2:45 గంటల సమయంలో, ఓ చిరుతపులి గుడిసెలోకి ప్రవేశించింది. నిద్రిస్తున్న రాహుల్‌ను నోట కరుచుకుని అడవిలోకి లాక్కెళ్లేందుకు ప్రయత్నించింది.
ఆ సమయంలో రాహుల్ భయంతో గట్టిగా కేకలు వేయడంతో, తల్లిదండ్రులు మేల్కొన్నారు. తమ కళ్లముందే చిరుతపులి తమ కొడుకును లాక్కెళ్తుండటం చూసి బేబీ ఏమాత్రం భయపడలేదు. ప్రాణాలకు తెగించి, దానిపైకి అరుస్తూ దూకాడు. బేబీ ధైర్యానికి బెదిరిపోయిన చిరుతపులి, రాహుల్‌ను అక్కడే వదిలేసి అడవిలోకి పారిపోయింది.
ఈ దాడిలో రాహుల్‌కు తలకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే కుటుంబసభ్యులు అతడిని సమీపంలోని టాటా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చాలకుడి తాలూకా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం రాహుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
గత రెండు నెలల్లో ఈ ప్రాంతంలో చిరుతపులి దాడి జరగడం ఇది మూడోసారి. వరుస ఘటనలతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అటవీశాఖ అధికారులు వన్యప్రాణుల దాడులను నివారించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read also:MedicalHistory : 30 ఏళ్ల క్రితం శీతలీకరించిన పిండం నుంచి శిశువు జననం: వైద్య చరిత్రలో అద్భుతం
