బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త! ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సిలెక్షన్ (IBPS) తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ పోస్టులు (Customer Service Associate) భర్తీ చేయబోతున్నారు.
ఈ నియామక ప్రక్రియలో దేశవ్యాప్తంగా 10,000 కంటే ఎక్కువ ఖాళీలు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 367 పోస్టులు, తెలంగాణలో 261 పోస్టులు ఉన్నాయి.
అర్హతలు:
-
అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
-
వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి (విభిన్న కేటగిరీలకు వయో సడలింపులు వర్తిస్తాయి).
ముఖ్యమైన తేదీలు:
-
దరఖాస్తు ప్రారంభం: ఆగస్ట్ 1, 2025
-
చివరి తేదీ: ఆగస్ట్ 21, 2025
-
ప్రిలిమినరీ ఎగ్జామ్: అక్టోబర్ 2025లో
-
మెయిన్స్ ఎగ్జామ్: నవంబర్ 2025లో
పోస్టుల వివరాలు:
-
మొత్తం ఖాళీలు: 10,000+
-
ఆంధ్రప్రదేశ్: 367 పోస్టులు
-
తెలంగాణ: 261 పోస్టులు
అప్లై చేయాలంటే:
అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతుంది.
Apply : https://ibpsreg.ibps.in/crpcsaxvjl25/
Read : ITJobs : టీసీఎస్ ఉద్యోగాలపై ఉత్కంఠ: జాయినింగ్ తేదీల కోసం నిరీక్షణ
