‘OG’ సృష్టించిన సంచలనం: అమెరికాలో రికార్డ్ ప్రీ-సేల్స్:పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, యువ దర్శకుడు సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘OG’ సినిమా అద్భుతమైన రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం అమెరికాలో ప్రీ-సేల్స్‌లో అత్యంత వేగంగా 500K డాలర్లు (సుమారు రూ. 4.15 కోట్లు) వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ ‘OG’ అమెరికాలో రికార్డుల మోత!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, యువ దర్శకుడు సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘OG’ సినిమా అద్భుతమైన రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం అమెరికాలో ప్రీ-సేల్స్‌లో అత్యంత వేగంగా 500K డాలర్లు (సుమారు రూ. 4.15 కోట్లు) వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ విజయాన్ని చిత్ర బృందం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ‘క్షణక్షణమొక తల తెగి పడెలే’ అనే క్యాప్షన్‌తో అభిమానులతో పంచుకుంది.
ఈ సినిమా సెప్టెంబర్ 24న అమెరికాలో ప్రీమియర్స్ తో, సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా ప్రియాంక మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా పరిచయమవుతున్నారు. అలాగే, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, నారా రోహిత్ కాబోయే భార్య సిరి లేళ్ల వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం తమన్ అందిస్తున్నారు.
Read also:NarendraModi : జపాన్‌లో మోదీ పర్యటన: కొత్త పుంతలు తొక్కుతున్న భారత్-జపాన్ స్నేహం
