MeeraMitun : తమిళ నటి మీరా మిథున్ అరెస్ట్: మూడేళ్లుగా పరారీలో ఉన్న నటిని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు

Tamil Actress Meera Mitun Arrested by Delhi Police After Three Years on the Run

MeeraMitun : తమిళ నటి మీరా మిథున్ అరెస్ట్: మూడేళ్లుగా పరారీలో ఉన్న నటిని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు:ద‌ళితుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేసులో త‌మిళ న‌టి మీరా మిథున్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మూడు సంవత్సరాలుగా పరారీలో ఉన్న ఆమెను పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు.

త‌మిళ న‌టి మీరా మిథున్ అరెస్ట్: మూడేళ్లుగా పరారీలో ఉండిన ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ద‌ళితుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేసులో త‌మిళ న‌టి మీరా మిథున్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మూడు సంవత్సరాలుగా పరారీలో ఉన్న ఆమెను పోలీసులు ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 11న ఆమెను కోర్టులో హాజ‌రు ప‌రచనున్నారు.

వివ‌రాల్లోకి వెళితే, 2021 ఆగ‌స్టులో ద‌ళితుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేసులో మీరా మిథున్‌తో పాటు ఆమె స్నేహితుడు శ్యామ్‌ అభిషేక్‌ను అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుద‌లైన తర్వాత ఆమె విచార‌ణ‌కు హాజ‌రు కాక‌పోవ‌డంతో 2022లో అరెస్ట్ వారెంట్ జారీ అయింది.

ఈ నేపథ్యంలో, ఆమెను రక్షించి తమకు అప్పగించాల‌ని కోరుతూ మీరా మిథున్ త‌ల్లి దాఖ‌లు చేసిన పిటిష‌న్ సోమ‌వారం కోర్టులో విచార‌ణ‌కు వచ్చింది. అప్పుడు చెన్నై లీగ‌ల్ స‌ర్వీసెస్ అథారిటీ ద్వారా ఢిల్లీలోని లీగ‌ల్ స‌ర్వీసెస్ అథారిటీకి సమాచారం ఇచ్చి, ఢిల్లీ పోలీసుల సాయంతో ఆమెను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను ఢిల్లీలోని ప్రభుత్వ హోంలో ఉంచినట్లు వెల్లడించారు.

Read also:ITR : ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేశారా? ఈ వెరిఫికేషన్ తప్పనిసరి

 

Related posts

Leave a Comment