Tesla : ఫ్లోరిడా కోర్టులో టెస్లాకు భారీ జరిమానా: ఆటోపైలట్ లోపం వల్లే ప్రమాదం అని నిర్ధారణ

Tesla Fined $242 Million in Florida Autopilot Crash Case

Tesla : ఫ్లోరిడా కోర్టులో టెస్లాకు భారీ జరిమానా: ఆటోపైలట్ లోపం వల్లే ప్రమాదం అని నిర్ధారణ:2019లో ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెస్లా కారులోని ఆటోపైలట్ వ్యవస్థలో లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని ఫ్లోరిడా కోర్టు నిర్ధారించింది. దీంతో, బాధిత కుటుంబానికి భారీ పరిహారం చెల్లించాలని టెస్లా సంస్థను ఆదేశించింది.

ఫ్లోరిడా కోర్టులో టెస్లాకు భారీ జరిమానా

2019లో ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టెస్లా కారులోని ఆటోపైలట్ వ్యవస్థలో లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని ఫ్లోరిడా కోర్టు నిర్ధారించింది. దీంతో, బాధిత కుటుంబానికి భారీ పరిహారం చెల్లించాలని టెస్లా సంస్థను ఆదేశించింది.

ఈ కేసులో, బాధితులకు మొత్తం 329 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. ఇందులో ఆటోపైలట్ వ్యవస్థ లోపం కారణంగా ఏర్పడిన నష్టానికి గాను 242 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు ₹2,100 కోట్లు) టెస్లా సంస్థ చెల్లించాలని, మిగిలిన మొత్తాన్ని వాహనం నడిపిన డ్రైవర్ చెల్లించాలని స్పష్టం చేసింది.

ప్రమాదం ఎలా జరిగింది?

2019లో ఫ్లోరిడాలోని కీ లార్గోలో జార్జ్ మెక్ గీ అనే వ్యక్తి తన టెస్లా కారులో ఆటోపైలట్ ఫీచర్‌ని ఆన్ చేసి ప్రయాణిస్తున్నాడు. డ్రైవింగ్ చేస్తుండగా అతని మొబైల్ కింద పడిపోయింది. కారు ఆటోపైలట్ మోడ్‌లోనే ఉందని భావించి, ఫోన్‌ను తీసుకునేందుకు జార్జ్ కిందకు వంగినప్పుడు కారు అదుపు తప్పింది. పక్కనే పార్క్ చేసి ఉన్న కారును ఢీకొట్టి, ఇద్దరు వ్యక్తులపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 22 ఏళ్ల యువతి అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించగా, ఈ కేసుపై సుదీర్ఘ విచారణ తర్వాత కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

Read also:RBI : భారతదేశ విదేశీ మారక నిల్వలు: RBI తాజా గణాంకాలు

 

Related posts

Leave a Comment