AyyappaSwamy : అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త: శబరిమల ప్రసాదం ఇక ఇంటికే

TDB to Deliver Sabarimala Prasadam to Homes; Service for 1252 Temples Soon
  • మరో నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామన్న శబరిమల దేవోసం బోర్డు

  • శబరిమల వరకూ వెళ్లలేని భక్తుల కోసం నిర్ణయం

  • ఆర్డర్ చేసిన వారికి ఇంటికే ప్రసాదం పంపిస్తామని వెల్లడి

శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు ఆలయ కమిటీ శుభవార్త అందించింది. శబరిమల వరకు రాలేని భక్తులు కూడా తమ ఇంటి వద్దకే స్వామి వారి ప్రసాదాన్ని తెప్పించుకునే వీలు కల్పిస్తున్నట్లు ట్రావెన్‌కూర్‌ దేవస్వోం బోర్డు (TDB) ప్రకటించింది.

  • ఆన్‌లైన్ ఆర్డర్: భక్తులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే, స్వామి వారి ప్రసాదాన్ని నేరుగా ఇంటికే పంపిస్తారు.
  • ఎప్పుడు మొదలవుతుంది?: మరో నెల రోజుల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని బోర్డు తెలిపింది.
  • సాంకేతికత: కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ సహాయంతో ఈ సదుపాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది.

ఇతర దేవాలయాల ప్రసాదాలు కూడా..

శబరిమల ఆలయంతో పాటు, ట్రావెన్‌కూర్‌ దేవస్వోం సంస్థానం పరిధిలో ఉన్న 1,252 దేవాలయాల ప్రసాదాలను కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునే సదుపాయాన్ని త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు TDB పేర్కొంది. శబరిమల వంటి ఆలయాలకు నేరుగా వెళ్లలేని భక్తులకు ఈ సదుపాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని బోర్డు అధ్యక్షుడు తెలిపారు. కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్ ఒక నెలలోపు పనిచేయడం ప్రారంభిస్తుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Read also : AP : ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని ముంచెత్తుతున్న వర్షాలు, వరదలు 

 

Related posts

Leave a Comment