-
ఆమె లైఫ్ లోని విషాదం గురించి ప్రస్తావన
-
ఫ్రెండ్స్ వలన తేరుకున్నానన్న మీనా
-
కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ పట్ల అసహనం
జగపతి బాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షో జీ తెలుగులో బాగా పేరు తెచ్చుకుంది. ముక్కుసూటిగా మాట్లాడే జగపతిబాబుని హోస్ట్‌గా ఎంచుకోవడం, షోను డిజైన్ చేసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ షోలో ఆయన నటి మీనాతో మాట్లాడిన విషయాలు చాలామందికి కనెక్ట్ అయ్యాయి.
జగపతి బాబు, మీనా పలు సినిమాల్లో కలిసి నటించారు కాబట్టి, వారి మధ్య మంచి స్నేహం ఉంది. ఆ సాన్నిహిత్యంతోనే ఆయన మీనాతో మాట్లాడారు. మీనా భర్తను కోల్పోయిన సమయంలో తాను రాలేకపోయినందుకు జగపతిబాబు క్షమాపణలు చెప్పారు. ఆమె ముఖం చూడటానికి ధైర్యం సరిపోకనే రాలేకపోయానని అన్నారు.
అందుకు మీనా స్పందిస్తూ, తాను చాలా బాధలో ఉన్నప్పుడు తన స్నేహితులు తోడుగా నిలిచారని, బాధపడి ఇంట్లో కూర్చోవద్దని చెప్పి బయటకి తీసుకెళ్లారని తెలిపారు. అయితే, కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తనకు రెండో పెళ్లి అంటూ ఇష్టం వచ్చినట్లు రాశాయని, అది తనకు చాలా బాధ కలిగించిందని చెప్పారు. “అంత అసహ్యంగా ఎలా రాయగలిగారు?” అని తనకు అనిపించిందని అన్నారు. అలాంటి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగపతిబాబు మీనాకి ధైర్యం చెప్పారు.
Read also : UPI : యూపీఐ లావాదేవీల పరిమితి పెంపు-ఎన్‌పీసీఐ కొత్త నిబంధనలు
