-
కుట్రకోణం ఉందని టీవీకే పార్టీ ఆరోపణ
-
విద్యుత్తు సరఫరాను నిలిపివేశారని విమర్శలు
-
విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని పార్టీనే కోరిందని ప్రభుత్వం వివరణ
తొక్కిసలాట వెనుక కుట్ర ఉందని, విజయ్ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంతసేపు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని టీవీకే పార్టీ ఆరోపించింది. విద్యుత్తు నిలిచిపోవడంతో అభిమానులు విజయ్ను చూసేందుకు ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగిందని ఆ పార్టీ పేర్కొంది.
ఈ ఆరోపణలకు తమిళనాడు విద్యుత్ బోర్డు (TNEB) స్పందించింది. రాష్ట్ర విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని టీవీకే పార్టీయే తమకు వినతిపత్రం సమర్పించిందని తెలిపారు. అయితే, తాము దానికి అంగీకరించలేదని ఆమె స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 27 రాత్రి వేలుసామిపురం వద్ద భారీ జనసమూహం ఉంటుందని అంచనా వేస్తూ టీవీకే నుంచి ఒక లేఖ అందిందని రాజ్యలక్ష్మి వెల్లడించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని విజయ్ మాట్లాడుతున్న సమయంలో కొంతసేపు విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని టీవీకే కోరిందని ఆమె పేర్కొన్నారు. తాము టీవీకే పార్టీ అభ్యర్థనను తిరస్కరించామని ఆమె స్పష్టంగా తెలిపారు.
ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించింది. తొక్కిసలాట జరిగిన వేదిక వద్ద కరెంట్ కోత లేదని ప్రభుత్వం పేర్కొంది. ఆ పార్టీ ఏర్పాటు చేసిన జనరేటర్లలో సమస్య కారణంగానే కొన్ని లైట్లు మసకబారాయని జిల్లా కలెక్టర్ వివరించారని తెలిపింది.
Read also : China : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన: 2 గంటల ప్రయాణం 2 నిమిషాల్లో! చైనా ఇంజినీరింగ్ అద్భుతం.
