-
‘కేజీఎఫ్’తో ఎంట్రీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి
-
తొలి సినిమాతోనే పాన్ ఇండియా హిట్
-
ఇమేజ్ ను పట్టించుకోనన్న బ్యూటీ
తొలి సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని అందుకోవాలని ప్రతి హీరోయిన్ కలలు కంటుంది. అలాంటి అదృష్టం కొద్దిమందికే దక్కుతుంది. ఆ అరుదైన అవకాశం దక్కించుకున్న వారిలో శ్రీనిధి శెట్టి ఒకరు. ఆమె నటించిన తొలి చిత్రం ‘కేజీఎఫ్’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.తాజాగా శ్రీనిధి శెట్టి ‘సుమన్ టీవీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రయాణం గురించి మాట్లాడారు.

వ్యక్తిగత కష్టాలు, సినీ ప్రయాణం: “మా పేరెంట్స్‌కి మేము ముగ్గురం ఆడపిల్లలమే. నేను పదో తరగతిలో ఉన్నప్పుడు అమ్మ చనిపోయింది. ఆ తర్వాత నాన్నే ఎన్నో కష్టాలు భరించి మమ్మల్ని పెంచారు,” అని ఎమోషనల్‌గా పంచుకున్నారు. “చిన్నప్పటి నుంచీ నాకు సినిమాలంటే చాలా ఇష్టం. అదే నన్ను ఈ సినీ రంగంలోకి వచ్చేలా చేసింది.

‘కేజీఎఫ్’ తర్వాత ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు నన్ను ఎంతో గొప్పగా ఆదరించారు,” అని కృతజ్ఞతలు తెలిపారు. క్రేజ్ వచ్చినా సింపుల్‌గా: ‘కేజీఎఫ్’ తర్వాత తనకు ఎన్నో ఆఫర్లు వచ్చాయని, కానీ తాను కేవలం నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటున్నానని శ్రీనిధి అన్నారు. ఎంత పెద్ద స్టార్‌డమ్ వచ్చినా తాను సాధారణంగా ఉండటానికే ఇష్టపడతానని చెప్పారు. “అవసరమైతే క్యాబ్‌లో ప్రయాణం చేస్తాను. మామూలుగా సూపర్ మార్కెట్‌లు, షాపింగ్ మాల్స్‌కి వెళ్తుంటాను.

రోడ్డుపక్కన పానీపూరీ కూడా తినేసి వస్తుంటాను,” అని సరదాగా చెప్పారు. “కాకపోతే, అక్కడివాళ్లు నన్ను గుర్తు పట్టేలోగా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాను,” అని నవ్వుతూ చెప్పుకొచ్చారు. శ్రీనిధి శెట్టి త్వరలో సిద్ధూ జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా అక్టోబర్ 17వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
Read also : PersonalLoan : పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈఎంఐ భారం కాకుండా ఉండాలంటే ఇది చదవాల్సిందే.
