RaashiKhanna : తెలుసు కదా’ షూటింగ్ పూర్తి చేసుకున్న రాశి ఖన్నా: భావోద్వేగ పోస్ట్ వైరల్

Siddhu Jonnalagadda's 'Telusu Kada' Nears Completion: Raashi Khanna's Post Creates Buzz
  • తెలుసు కదా’పై అంచనాలు పెంచుతున్న రాశి ఖన్నా పోస్ట్
  • శ్రీనిధి శెట్టితో కలిసి సిద్ధు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నాదీపావళికి సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న రాశి ఖన్నా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను తాజాగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆ పోస్ట్‌లో రాశి ఖన్నా ఇలా రాశారు: “కెమెరాలు ఆగిపోయినా కూడా కొన్ని కథలు మనతోనే ఉండిపోతాయి. ‘తెలుసు కదా’ నాకు అలాంటిదే. ఈ ప్రయాణం చాలా ప్రత్యేకం. నా ఈ జర్నీలో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేం ఎంతో ప్రేమతో సృష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టే ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.” ఆమె రాసిన ఈ మాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.

ఈ చిత్రంతో ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతుండటం విశేషం. సిద్ధు సరసన రాశి ఖన్నాతో పాటు, మరో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఇది ఒక అందమైన రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. భావోద్వేగాలను ప్రధానంగా చూపించే ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 17న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Read also:LungCancer : ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కొత్త చికిత్స: చైనా శాస్త్రవేత్తల ఆశాజనక పరిశోధన

 

Related posts

Leave a Comment