-
హృద్రోగ బాధితుల్లో కంటి చూపు మందగిస్తుందంటున్న నిపుణులు
-
రక్త ప్రసరణ సాఫీగా జరగకపోవడమే కారణమని వివరణ
-
మధుమేహంతో కంటి సమస్యలతో పాటు గుండెకూ ముప్పు
హృద్రోగులకు కంటి సమస్యలు
గుండె జబ్బులకు, కంటి చూపుకు మధ్య సంబంధం ఉందని ఇటీవలి పరిశోధనలో వెల్లడైంది. గుండె జబ్బులు ఉన్నవారిలో కంటి చూపు తగ్గడం లేదా కంటికి సంబంధించిన ఇతర సమస్యలు సాధారణం. గుండెపోటు లక్షణాలను కంటి పరీక్ష ద్వారా కూడా తెలుసుకోవచ్చని వైద్యులు అంటున్నారు. రక్త నాళాల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల కంటి నరాలకు రక్తం సరిగా అందక కంటి చూపు మందగిస్తుంది. గుండె విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటివి కూడా గుండె పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.
గుండెపోటు ప్రధాన కారణం
ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాల్లో గుండెపోటు ఒకటి. గుండెపోటు లక్షణాలుగా ఛాతీ నొప్పి, శ్వాస అందకపోవడం, అధిక రక్తపోటుతో పాటు ఇప్పుడు కంటి చూపు కూడా చేరింది. కంటి పరీక్షలో గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. చూపు మందగించడం లేదా చూపు కోల్పోవడం వంటి సమస్యలకు రెటీనా దెబ్బతినడమే కారణం. రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, రక్త నాళాల్లో వాపు వంటి సమస్యల వల్ల రెటీనా దెబ్బతింటుంది.
గుండెపోటు-కంటి సమస్యల సంబంధం
సరిగ్గా ఇవే సమస్యలు గుండె జబ్బులకు కూడా కారణమవుతాయి, గుండెపోటుకు దారితీస్తాయి. అందుకే, కంటి సమస్యలు మీ గుండె ఆరోగ్యానికి ఒక సూచికగా పనిచేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కంటి సమస్యలు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని, కంటి చూపును కాపాడుకోవడానికి ప్రతిరోజూ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలపాటు బ్రేక్ లేకుండా నిద్రించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read also : NaraLokesh : వైఎస్సార్సీపీ ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారాలు చేస్తోందని మంత్రి నారా లోకేశ్ ఆరోపణ
