SamanthaRuthPrabhu : సమంత రాజ్‌ నిడిమోరు డేటింగ్‌: దీపావళి ఫొటోలతో బలపడుతున్న ఊహాగానాలు!

Samantha Ruth Prabhu and Raj Nidimoru Dating Rumours Gain Momentum After Diwali Celebrations

బాలీవుడు దర్శకుడు రాజ్ నిడిమోరు కుటుంబంతో సమంత దీపావళి వేడుకలు

ఫోటోలు షేర్ చేస్తూ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయిందని పేర్కొన్న సమంత

టాలీవుడ్‌ నటి సమంత రూత్‌ ప్రభు, బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల వీరిద్దరూ కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది.

తాజాగా రాజ్‌ నిడిమోరు కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. బాణసంచా కాలుస్తున్న ఫొటోలను సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ.. “నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది” అని వ్యాఖ్యానించారు. ఈ ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

గతంలో రాజ్‌-డీకే దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2’, ‘సిటడెల్‌: హనీ బన్నీ’ వెబ్‌ సిరీస్‌లలో సమంత నటించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆమెకు రాజ్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ తరచుగా కలిసి కనిపిస్తుండటంతో డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఈ విషయంపై ఇరువురూ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.

Read also : IT : భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగుల కోత: కారణాలు, వివరాలు

 

Related posts

Leave a Comment