Bank of India:బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 514 క్రెడిట్ ఆఫీసర్ ఉద్యోగాలు – డిసెంబర్ 20 నుంచి దరఖాస్తులు
దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India) బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఫ్రేమ్‌లో క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 20, 2025 నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జనవరి 5, 2026.
పోస్టుల వివరాలు:
క్రెడిట్ ఆఫీసర్ (ఎస్ఎంజీఎస్–4): 36 పోస్టులు
క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్–3): 60 పోస్టులు
క్రెడిట్ ఆఫీసర్ (ఎంఎంజీఎస్–2): 418 పోస్టులు
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీ, సీఏ లేదా సీఎంఏ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
దరఖాస్తు ఫీజు:
జనరల్ అభ్యర్థులు: రూ.850
ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ అభ్యర్థులు: రూ.175
ఎంపిక విధానం:
ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
జీతభత్యాలు:
ఎంఎంజీఎస్–2: నెలకు రూ.64,820 నుంచి రూ.93,960 వరకు
ఎంఎంజీఎస్–3: నెలకు రూ.85,920 నుంచి రూ.1,05,280 వరకు
ఎస్ఎంజీఎస్–4: నెలకు రూ.1,02,300 నుంచి రూ.1,20,940 వరకు
రాత పరీక్ష విధానం:
రాత పరీక్ష మొత్తం 150 ప్రశ్నలకు 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
విభాగాల వారీగా మార్కుల వివరాలు:
ఇంగ్లిష్ లాంగ్వేజ్: 25 ప్రశ్నలు – 25 మార్కులు
రీజనింగ్: 25 ప్రశ్నలు – 25 మార్కులు
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్: 25 ప్రశ్నలు – 25 మార్కులు
ప్రొఫెషనల్ నాలెడ్జ్: 75 ప్రశ్నలు – 75 మార్కులు
బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన ఉద్యోగాన్ని కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
Read more:AP Govt Jobs: AP Govt Job Calendar 2026: Complete Department-wise Vacancy Details
