ISRO VSSC Apprentice Recruitment 2025:విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో అప్రెంటిస్ ఖాళీలు – నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఆధ్వర్యంలో పనిచేస్తున్న కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) 2025–26 సంవత్సరానికి గాను గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం పూర్తిగా రాత పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూలు మరియు విద్యార్హతల ఆధారంగా నిర్వహించబడుతుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 90 అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటిలో:
23 జనరల్ స్ట్రీమ్ (నాన్-ఇంజినీరింగ్) గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
67 డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులు ఉన్నాయి
అభ్యర్థులు డిసెంబర్ 29, 2025 తేదీన జరిగే సెలక్షన్ డ్రైవ్/ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూ రోజునే దరఖాస్తులను స్వీకరిస్తారు.
అర్హతలు
సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి
చివరి సంవత్సర విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
ఇప్పటికే అప్రెంటిస్ శిక్షణ పొందినవారు అర్హులు కారు
వయోపరిమితి (డిసెంబర్ 31, 2025 నాటికి)
గరిష్ట వయసు: 28 ఏళ్లు
OBC: 3 సంవత్సరాల సడలింపు
SC/ST: 5 సంవత్సరాల సడలింపు
PwD: 10 సంవత్సరాల సడలింపు
దరఖాస్తు విధానం
అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి
తరువాత అవసరమైన సర్టిఫికేట్లతో కలసి ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావాలి
ఎలాంటి రాత పరీక్ష లేదు – విద్యార్హతలు + ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక
స్టైపెండ్
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: ₹9,000 నెలకు
డిప్లొమా టెక్నీషియన్ అప్రెంటిస్: ₹8,000 నెలకు
ఇంటర్వ్యూ అడ్రస్
VSSC Guest House, ATF Area, Veli,
Near Veli Church, Thiruvananthapuram District, Kerala.
Read more :ISRO VSSC Jobs: Vikram Sarabhai Space Centre (VSSC) Medical & Dental Officer Recruitment 2025
