RCF Kapurthala Recruitment 2026 | 550 Apprentice Posts for ITI Candidates

RCF Kapurthala recruitment 2026

RCF Kapurthala recruitment 2026:రైల్ కోచ్ ఫ్యాక్టరీలో 550 అప్రెంటిస్ పోస్టులు | ఐటీఐ అభ్యర్థులకు గుడ్ న్యూస్

పంజాబ్ రాష్ట్రం కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కోచ్ తయారీ యూనిట్లలో ఒకటి. ఈ సంస్థలో ప్రాక్టికల్ ట్రైనింగ్ (యాక్ట్ అప్రెంటిస్) కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 550 యాక్ట్ అప్రెంటిస్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి (మెట్రిక్యులేషన్)తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జనవరి 7, 2026.

 ఖాళీల విభజన

యూరీ (UR): 275 పోస్టులు

ఎస్సీ (SC): 85 పోస్టులు

ఎస్టీ (ST): 42 పోస్టులు

ఓబీసీ (OBC): 148 పోస్టులు

ట్రేడ్లు

ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రిషియన్,
ఏసీ & రిఫ్రిజిరేటర్ మెకానిక్, మోటార్ వెహికిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ తదితర ట్రేడ్లలో ఈ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

 అర్హతలు

మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణత

సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్

వయోపరిమితి: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య (జనవరి 7, 2026 నాటికి)

 ఎంపిక విధానం

ఈ అప్రెంటిస్ పోస్టులకు రాత పరీక్ష ఉండదు.
మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధించిన మార్కులు మరియు రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది.

 దరఖాస్తు ఫీజు

జనరల్ అభ్యర్థులు: రూ.100

ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / మహిళా అభ్యర్థులు: ఫీజు మినహాయింపు

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫీజును జనవరి 9, 2026 వరకు చెల్లించవచ్చు.
శిక్షణ కాలంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైపెండ్ కూడా చెల్లిస్తారు.

 పూర్తి వివరాలు మరియు దరఖాస్తు కోసం అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించాలి.

Read more :Railway Jobs 2025:సెంట్రల్ రైల్వేలో కల్చరల్ కోటా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

Related posts

Leave a Comment