Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

5 జీలను నమ్ముకున్న టీ కాంగ్రెస్

0

హైదరాబాద్, సెప్టెంబర్ 14

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా ఈ నెల 17న విజయభేరి సభను తలపెట్టింది తెలంగాణ కాంగ్రెస్. సోనియా గాంధీ హజరుకానున్న ఈ సభ నుంచే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని హస్తం పార్టీ భావిస్తోంది.తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రధాన పార్టీలు కదనరంగంలోకి దూకెందుకు సిద్ధమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ ఇప్పటికే దూకుడు పెంచగా…. కాంగ్రెస్ అస్త్రాలను సిద్ధం చేసే పనిలో పడింది. ఓవైపు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తుండగా… మరోవైపు కీలకమైన సీడబ్యూసీ భేటీని హైదరాబాద్ వేదికగా నిర్వహించబోతుంది. ఇదే సమయంలో విజయభేరి పేరుతో భారీ సభను తలపెట్టింది. ఇదే సభా వేదిక నుంచి కాంగ్రెస్ అగ్రనాయకత్వం…. ఎన్నికల శంఖారావాన్ని పూరించోతున్నాయి. సోనియాగాంధీ హాజరవుతున్న ఈ సభ సాక్షిగా… కీలకమైన హామీలను ప్రకటించనున్నట్లు రాష్ట్ర నేతలు తెలిపారు. ఫలితంగా ఈ సభను విజయవంతం చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు.

ఈ నెల 16న హైదరాబాద్‌లోని తా‌జ్‌కృష్ణాలో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకోసం కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కదలిరానుంది. అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ కీలకమైన సీడబ్యూసీ మీటింగ్ కు హైదరాబాద్ ను వ్యూహత్మకంగా ఎంపిక చేసింది కాంగ్రెస్. ఇక ఇదే సమయంలో 17వ తేదీన భారీ సభను తలపెట్టింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో విజయభేరి సభను నిర్వహించబోతుంది. ఈ సభా వేదిక నుంచి 5 గ్యారెంటీ హామీలను ప్రకటించనున్నారు సోనియా గాంధీ. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీతో కీలకమైన ప్రకటనలు చేయించటం ద్వారా…. బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని టీపీసీసీ భావిస్తోంది. ఇందులో భాగంగా తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే విషయానికి సంబంధించి ఐదు ప్రధాన హామీలను ప్రకటించనుంది.ఇక సోనియాగాంధీ ప్రకటించే ఐదు గ్యారంటీ హామీలలో ఏ ఏ అంశాలు ఉంటాయనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.

ఇప్పటికే పలు డిక్లరేషన్లను ప్రకటించిన కాంగ్రెస్… విజయభేరి సభ వేదిక నుంచి ఎలాంటి ప్రకటనలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ గ్యారంటీలలో ప్రధానంగా తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ, కర్ణాటకలో మాదిరిగా మహిళలకు ఉచిత ప్రయాణం, గృహలక్ష్మితో పాటు ఉద్యోగాల భర్తీ, ఎస్సీ ఎస్టీ, బీసీ సబ్ ప్లాన్ వంటి అంశాలు ఉంటాయని పార్టీ వర్గాల మేరకు తెలుస్తోంది.బహిరంగ సభకు భారీ ఎత్తున జనాన్ని సమీకరించాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రతి మండలం నుంచి జనాన్ని తరలించేందుకు పక్కా ప్రణాళికతో పనిచేయాలని… అన్ని నియోజకవర్గాల్లో స్థానిక కార్యకర్తలు, నేతలతో సమావేశాలు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు.

అందుకు తగ్గట్టే స్థానిక నేతలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. భారీగా జనం తరలించేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్‌ నగరానికి దగ్గరగా ఉన్న జిల్లాల నుంచి అధిక సంఖ్యలో జనాన్ని తరలించాలని భావిస్తున్నారు. ఇక ఇదే సభా వేదిక నుంచి చేరికలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్న రాష్ట్ర నాయకత్వం…. ఆయా నేతలు సై అంటే సోనియా గాంధీ సమక్షంలో చేరేలా చూసే పనిలో ఉన్నారు.మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల వేళ…. సీడబ్యూసీ భేటీతో పాటు విజయభేరి సభతో తెలంగాణ ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక బీజేపీ, బీఆర్ఎస్ విధానాలపై అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie