Mumbai :120 నుంచి 500 మిలియన్ డాలర్లకు పెరిగిన ఎగుమతులు

brife news

Mumbai :టీవల విడుదలైన డేటా ప్రకారం దేశంలో  పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాలు వంటి సాంప్రదాయ ఎగుమతులను అధిగమించి భారతదేశ స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు గత మూడేళ్లల్లో బాగా పెరిగాయి. అమెరికాకు దాదాపు ఐదు రెట్లు, జపాన్‌కు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 2023-24లో 15.57 బిలియన్ల డాలర్లు, 2022-23లో 10.96 బిలియన్ల డాలర్ల నుంచి 2024-25లో 24.14 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి.

120 నుంచి 500 మిలియన్ డాలర్లకు పెరిగిన ఎగుమతులు

ముంబై, మే 22
ఇటీవల విడుదలైన డేటా ప్రకారం దేశంలో  పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాలు వంటి సాంప్రదాయ ఎగుమతులను అధిగమించి భారతదేశ స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు గత మూడేళ్లల్లో బాగా పెరిగాయి. అమెరికాకు దాదాపు ఐదు రెట్లు, జపాన్‌కు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 2023-24లో 15.57 బిలియన్ల డాలర్లు, 2022-23లో 10.96 బిలియన్ల డాలర్ల నుంచి 2024-25లో 24.14 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసిన మొదటి ఐదు దేశాలు అమెరికా, నెదర్లాండ్స్, ఇటలీ, జపాన్, చెక్ రిపబ్లిక్‌గా ఉన్నాయి. అమెరికాకు భారతదేశం ఎగుమతులు 2022-23లో 2.16 బిలియన్ల డాలర్ల నుంచి 2023-24లో 5.57 బిలియన్ల డాలర్లకు, 2024-25లో 10.6 బిలియన్ల డాలర్లకు పెరిగాయి.ఎగుమతుల విషయంలో జపాన్‌లో కూడా గణనీయమైన ఎగుమతి వృద్ధి నమోదైంది.

ఈ దేశానికి ఎగుమతులు 2022-23లో 120 మిలియన్ల డాలర్లకు నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 520 మిలియన్ల డాలర్లకు పెరిగాయి. ఈ వేగవంతమైన పెరుగుదల వల్ల స్మార్ట్‌ఫోన్లు భారతదేశంలో అత్యధికంగా ఎగుమతి చేసిన వస్తువుల్లో ఒకటిగా మారిందని. పెట్రోలియం ఉత్పత్తులు, వజ్రాలు వంటి ఎగుమతులను అధిగమించడానికి దోహదపడిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు. ఉత్పత్తి-సంబంధిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకం వంటి ప్రభుత్వ పథకాల వల్ల వృద్ధి వేగంగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ సర్వీస్ నివేదిక ప్రకారం 2024లో భారతదేశ స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో ఆపిల్, సామ్‌సంగ్ దాదాపు 94 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2024లో మేడ్-ఇన్- ఇండియా స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు సంవత్సరానికి 6 శాతం పెరిగాయి. 2025లో భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ తయారీ వృద్ధి అంచనా 2025లో రెండంకెలలో పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కోడ్ భాషలో చాటింగ్, RSS నేతలే టార్గెట్

Terror Plot: కోడ్ భాషలో చాటింగ్, RSS నేతలే టార్గెట్! దేశవ్యాప్తంగా  పేలుళ్లకు కుట్ర కేసులో కీలక అంశాలు... | Terror plot foiled case police  retrieve siraj and sameer phone chattings ...

ముంబై, మే 22
దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అహం పేరుతో 12 మందితో సిరిజ్ ఓ గ్రూప్ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌, వరంగల్, విజయనగరం యువకులతో గ్రూప్ క్రియేట్ చేశాడు. సౌదీలో ఉన్న ఇమ్రాన్ ఆదేశాలతో అహం సంస్థను ఏర్పాటు చేశాడు సిరాజ్. అహం సంస్థ కోసం 40 లక్షల నగదును సిరాజ్‌కు పంపాడు ఇమ్రాన్.పేలుళ్లకు కేసులో సిరాజ్‌, సమీర్‌ను 5 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు. సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. సిరాజ్, సమీర్ ఫోన్‌ చాటింగ్స్‌ రిట్రీవ్ చేశారు పోలీసులు. ఇన్‌స్టాలో కోడ్‌ భాషలో సిరాజ్, సమీర్ మాట్లాడుకున్నారు.

అమెజాన్ నుంచి పేలుడు పదార్థాలు కొనుగోలు చేయాలని చాటింగ్ చేశారు. విజయనగరంలో కెమికల్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సిరాజ్ నిర్ణయించాడు. కెమికల్ ల్యాబ్‌కు అందరినీ తీసుకొచ్చి ప్రయోగాలు చేసేలా సిరాజ్ ప్లాన్ చేశాడు.ఆర్ఎస్‌ఎస్ నేతలను టార్గెట్ చేద్దామని యువకులకు తెలిపాడు సిరాజ్. అది సక్సెస్ అయిన తర్వాత మరిన్ని పనులు చేద్దామని సిరాజ్ ప్లాన్ చేశాడు. ప్లాన్ రెడీ అయ్యింది, అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ చాటింగ్ చేశాడు. ఆర్డర్ చేసిన పేలుడు పదార్థాలను వీడియో చాటింగ్‌లో చూపెట్టుకున్నాడు సిరాజ్. 12 మంది కలిసి గ్రూప్‌ కాల్‌లో మాట్లాడుకుందామని తెలిపాడు సిరాజ్.

Read more:AP : ఏపీలో మరో గ్రీన్ ఫీల్డ్

Related posts

Leave a Comment