మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే సహించం : మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ

Rayapati Sailaja

మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తే సహించం : మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ, కొన్ని రాజకీయ నాయకుల మద్దతుతో నడిచే మీడియా సంస్థలు సమాజానికి ప్రమాదకరంగా మారుతున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఒక ప్రముఖ టీవీ ఛానెల్‌కి చెందిన జర్నలిస్టులు అమరావతి ప్రాంత మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

“గుంటూరులో 150 ఇన్‌స్టిట్యూట్స్‌లో సెక్స్ వర్కర్లు రిజిస్టర్ అయ్యారు” అనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన అంశాన్ని తిప్పికొడుతూ, “ఇది పూర్తిగా అసత్య సమాచారం. ఈ సమాచారం Times of India కథనాన్ని వక్రీకరించి వాడినట్లు ఉంది. అసలు రాష్ట్రం మొత్తం మీద గణాంకాలే ఉన్నాయి కానీ, ఏప్రాంతాన్ని సూచించలేదు. కానీ కొందరు జర్నలిస్టులు రాజకీయ లబ్ధికోసం ప్రాంతీయ మహిళలపై ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యానించడం దుర్మార్గం,” అని ఆమె పేర్కొన్నారు.

“ప్రస్తుతం ప్రభుత్వం మారి, అమరావతి అభివృద్ధి దిశగా పయనిస్తున్న సమయంలో, మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మహిళల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది,” అని శైలజ ఆవేదన వ్యక్తం చేశారు.

“ఇలాంటి వ్యాఖ్యలు, మీడియా చార్టర్‌ను ఉల్లంఘిస్తున్నాయి. ప్రజల విశ్వాసాన్ని గెలవాల్సిన జర్నలిజం, రచ్చకారులకు వేదికగా మారకూడదు. మీడియా స్వేచ్ఛ అనేది బాధ్యతతో కూడినది. ఒకవేళ దురుద్దేశంతో అసత్య ప్రచారం చేస్తే, అవసరమైతే ఆ ఛానెళ్లపై చర్యలు తీసుకునే అధికారం ప్రెస్ కౌన్సిల్‌కు ఉంది,” అని ఆమె హెచ్చరించారు.

ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. మరో జ‌ర్నలిస్టుకు, సాక్షి మీడియా యాజమాన్యానికి, చీఫ్ ఎడిటర్‌కు సమన్లు సిద్ధమవుతున్నాయని తెలిపారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: సిట్ విచారణకు హాజరు అయిన మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు

 

Related posts

Leave a Comment