OperationSindoor : ఆపరేషన్ సింధూర్’పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి – గౌరవ్ గొగోయ్

Gaurav Gogoi Demands Answers on 'Operation Sindoor' and Pahalgam Attack

OperationSindoor : ఆపరేషన్ సింధూర్’పై ప్రభుత్వం సమాధానం చెప్పాలి – గౌరవ్ గొగోయ్:కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ‘ఆపరేషన్ సింధూర్’పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని లోక్‌సభలో డిమాండ్ చేశారు. పాకిస్థాన్ కుట్రలను అడ్డుకోవాలని, దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షంగా తాము అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం బదులివ్వాలని ఆయన కోరారు.

కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రశ్నలు: ఆపరేషన్ సింధూర్, ఉగ్రవాదుల చొరబాటుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి

కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ‘ఆపరేషన్ సింధూర్’పై ప్రభుత్వం సమాధానం చెప్పాలని లోక్‌సభలో డిమాండ్ చేశారు. పాకిస్థాన్ కుట్రలను అడ్డుకోవాలని, దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షంగా తాము అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం బదులివ్వాలని ఆయన కోరారు.

ఆపరేషన్ సింధూర్ గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చాలా విషయాలు చెప్పినప్పటికీ, పహల్గామ్‌కు ఉగ్రవాదులు ఎలా చేరుకుని దాడి చేయగలిగారో వివరించలేదని గొగోయ్ అన్నారు. ఉగ్రవాదులు పారిపోవడానికి ఎవరైనా సహాయం చేశారా అనే దానిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు.

ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి భార్య “తన భర్త మృతదేహంపై రాజకీయాలు వద్దని” కోరడాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పాకిస్థాన్ మన సమాజంలో విభేదాలను సృష్టించాలని చూస్తోందని, అయితే ఈ విషయంలో ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తామని రాహుల్ గాంధీ కూడా చెప్పారని గొగోయ్ వెల్లడించారు. పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిందేనని ఆయన అన్నారు.

ఉగ్రవాదులకు సహకరించిన వారి గురించి ప్రభుత్వం వద్ద సమాచారం లేదని గొగోయ్ ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్ ప్రశాంతంగా ఉందని చెప్పినప్పటికీ, ఇంత దారుణం జరగడం ఆందోళన కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

Read also:HarishRao : కోటి పరిహారం హామీ ఏమైంది? సిగాచీ బాధితుల ఆవేదనపై హరీశ్ రావు

 

Related posts

Leave a Comment