Movie News : సతీ లీలావతి’ టీజర్ విడుదల: లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ మధ్య ఫన్నీ గొడవలు:లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సతీ లీలావతి’. ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ‘ఎస్.ఎం.ఎస్ (శివ మనసులో శృతి)’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన తాతినేని సత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ల ‘సతీ లీలావతి’ టీజర్ విడుదల!
లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సతీ లీలావతి’. ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ‘ఎస్.ఎం.ఎస్ (శివ మనసులో శృతి)’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన తాతినేని సత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా, మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
టీజర్ చూస్తుంటే, భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధాన్ని కేవలం ఎమోషనల్‌గానే కాకుండా, ఎంటర్‌టైనింగ్‌గా కూడా చూపించారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే కౌంటర్స్, సరదా పంచ్‌లతో టీజర్ చాలా ఫన్నీగా ఉంటూ నవ్వులు పూయిస్తోంది. లావణ్య, దేవ్ మోహన్ మధ్య జరిగే గొడవకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను టీజర్‌లో చూపించారు. ఈ సినిమాలో లావణ్య తన నటనతో మరోసారి అదరగొట్టిందని అంటున్నారు. వరుణ్‌తో వివాహం తర్వాత ఆమె నటించిన తొలి చిత్రం ఇది.
నరేశ్, వి.టి.వి.గణేశ్, సప్తగిరి, జాఫర్ వంటి నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Read also:Both States : కృష్ణా నదికి భారీ వరద: జలాశయాలు నిండు కుండలు
