Pawan Kalyan : పొలాల్లోకి ఏనుగులు రాకుండా చర్యలు: పవన్ కల్యాణ్ ఆదేశం:గత కొన్నేళ్లుగా ఏనుగులు అటవీ ప్రాంతాలను వీడి జనావాసాల్లోకి ప్రవేశిస్తూ, పొలాల్లో పనిచేస్తున్న వారిపై దాడి చేసి చంపేయడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఇటీవలే చిత్తూరు జిల్లాలో రామకృష్ణంరాజు అనే రైతు ఏనుగుల దాడిలో మరణించారు.
చిత్తూరులో ఏనుగుల దాడి.. అటవీశాఖ అప్రమత్తం
గత కొన్నేళ్లుగా ఏనుగులు అటవీ ప్రాంతాలను వీడి జనావాసాల్లోకి ప్రవేశిస్తూ, పొలాల్లో పనిచేస్తున్న వారిపై దాడి చేసి చంపేయడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. ఇటీవలే చిత్తూరు జిల్లాలో రామకృష్ణంరాజు అనే రైతు ఏనుగుల దాడిలో మరణించారు. నిన్న, సోమవారం కూడా తిరుపతి శ్రీవారి మెట్టు మార్గంలో పంప్ హౌస్ వద్ద ఏనుగులు కనిపించాయి. అవి సమీపంలోని పొలాలను ధ్వంసం చేశాయి.
ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఈరోజు ఆయన తన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏనుగుల గుంపులు పొలాలపైకి రాకుండా, వాటిని తిరిగి అటవీ ప్రాంతంలోకి పంపించే చర్యలను పకడ్బందీగా చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.
ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తుండాలని, గ్రామస్తులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఏనుగుల కదలికలపై వారికి ముందుగా సమాచారం అందిస్తుండాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఏనుగుల ప్రభావం ఉన్న గ్రామాల్లో అటవీశాఖ సిబ్బంది పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
Read also:Kavitha : బీసీ బిల్లు కోసం కవిత 72 గంటల దీక్ష: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి
