INCOIS : రష్యా భూకంపం: భారత్‌కు సునామీ ముప్పు లేదని INCOIS స్పష్టం:రష్యాను భారీ భూకంపం కుదిపేసింది. కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్‌కు తూర్పుగా 136 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది.
భారత్‌కు సునామీ ముప్పు లేదు: INCOIS వెల్లడి
రష్యాను భారీ భూకంపం కుదిపేసింది. కంచట్కా ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్‌స్క్‌కు తూర్పుగా 136 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో రష్యా, జపాన్, అమెరికా తీర ప్రాంతాలను సునామీ తాకింది.
ఈ నేపథ్యంలో, భారత్‌కు సునామీ ముప్పు ఉందా అనే సందేహాలు తలెత్తాయి. దీనిపై ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (INCOIS) స్పందించింది. భారత్‌కు, అలాగే హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు ఎలాంటి సునామీ ముప్పు లేదని INCOIS స్పష్టం చేసింది. ఈ విషయాన్ని INCOIS తమ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించింది.
కంచట్కా తూర్పు తీరంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించి, అనంతరం సునామీ తాకినప్పటికీ, దీని కారణంగా భారత్‌కు లేదా హిందూ మహాసముద్ర తీర ప్రాంతాలకు సునామీ ముప్పు లేదు” అని INCOIS తన ట్వీట్‌లో పేర్కొంది.ఈ భూకంపం తర్వాత రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీరప్రాంతాలను సునామీ తాకింది. అమెరికాలోనూ హెచ్చరికలు జారీ చేయగా, హవాయి ద్వీపంలో అప్రమత్తత ప్రకటించారు.
Read also:NASA : చంద్రుడిని ఢీకొట్టనున్న గ్రహశకలం? భూమిపై ప్రభావంపై ఆందోళన
