Indigo : ఇండిగో విమానంలో తోటి ప్రయాణికుడిపై దాడి:ముంబై నుంచి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో విమానంలో గందరగోళం నెలకొంది. వివరాల్లోకి వెళితే..విమానంలో ఒక వ్యక్తి తోటి ప్రయాణికుడి చెంపపై కొట్టడం గమనించిన ఇద్దరు విమాన సిబ్బంది, దాడికి గురైన వ్యక్తిని ముందుకు తీసుకువెళుతుండగా, దాడి చేసిన వ్యక్తి మరోసారి అతడిపై చేయి చేసుకున్నాడు.
ఇండిగో విమానంలో ప్రయాణికుడిపై దాడి ఘటన
ముంబై నుంచి కోల్కతా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో విమానంలో గందరగోళం నెలకొంది. వివరాల్లోకి వెళితే..విమానంలో ఒక వ్యక్తి తోటి ప్రయాణికుడి చెంపపై కొట్టడం గమనించిన ఇద్దరు విమాన సిబ్బంది, దాడికి గురైన వ్యక్తిని ముందుకు తీసుకువెళుతుండగా, దాడి చేసిన వ్యక్తి మరోసారి అతడిపై చేయి చేసుకున్నాడు. దీంతో విమానంలో ఉన్న ఇతర ప్రయాణికులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, దాడి చేసిన వ్యక్తి తనకి ఎదురైన సమస్య కారణంగా అలా చేశానని చెప్పాడు. వెంటనే మరో ప్రయాణికుడు, సమస్యలు అందరికీ వస్తాయని, అలా అని ఎవరిపైనా చేయి చేసుకుంటారా? అంటూ ప్రశ్నించాడు. ఈ ఘటనపై పైలట్ కోల్కతా విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే దాడి చేసిన వ్యక్తిని ఎయిర్పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనను మరో ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అది వైరల్గా మారింది.
Read also:AP : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్: రాజ్ కసిరెడ్డి కన్నీరు, మిథున్ రెడ్డికి రిమాండ్ పొడిగింపు
