Bihar : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ముసాయిదా జాబితా నుంచి 65 లక్షల ఓటర్లు తొలగింపు

Voter List Revision in Bihar: Key Highlights

Bihar : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ముసాయిదా జాబితా నుంచి 65 లక్షల ఓటర్లు తొలగింపు:బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పూర్తిచేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా జాబితాను ఇటీవల విడుదల చేసింది. ఈ జాబితాలో దాదాపు 65 లక్షల మంది ఓటర్లను చేర్చలేదు.

బీహార్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పూర్తిచేసింది. దీనికి సంబంధించిన ముసాయిదా జాబితాను ఇటీవల విడుదల చేసింది. ఈ జాబితాలో దాదాపు 65 లక్షల మంది ఓటర్లను చేర్చలేదు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 7.9 కోట్ల ఓటర్లు ఉండగా, తాజా ముసాయిదా జాబితాలో ఆ సంఖ్య 7.24 కోట్లకు తగ్గింది.

కొత్తగా విడుదల చేసిన జాబితాలో, పాట్నాలో అత్యధికంగా 3.95 లక్షలు, మధుబనీలో 3.52 లక్షలు, తూర్పు చంపారన్‌లో 3.16 లక్షలు, గోపాల్‌గంజ్‌లో 3.10 లక్షల మంది ఓటర్లు వారి ధ్రువపత్రాలు సమర్పించకపోవడంతో చేర్చలేదని ఎన్నికల సంఘం తెలిపింది.

మొత్తం జాబితాలో 22.34 లక్షల మంది ఓటర్లు చనిపోయారని, 36.28 లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారని లేదా ఆయా చిరునామాల్లో లేరని ఈసీ గుర్తించింది. మరో 7.01 లక్షల మంది ఒకటి కన్నా ఎక్కువసార్లు ఓటరుగా నమోదు చేసుకున్నారని పేర్కొంది. ఈ ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే, సెప్టెంబర్ 1లోగా తెలియజేయవచ్చని ఈసీ తెలిపింది. అనంతరం తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది.

Read also:RBI : భారతదేశ విదేశీ మారక నిల్వలు: RBI తాజా గణాంకాలు

 

Related posts

Leave a Comment