Cyber Scam : ఒక్క క్లిక్‌తో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! ‘APK ఫ్రాడ్’పై హెచ్‌డీఎఫ్‌సీ హెచ్చరిక!

A Single Click Can Empty Your Bank Account! HDFC Bank Warns Against 'APK Fraud'

Cyber Scam : ఒక్క క్లిక్‌తో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! ‘APK ఫ్రాడ్’పై హెచ్‌డీఎఫ్‌సీ హెచ్చరిక:ఒక్క క్లిక్‌తో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త పద్ధతిలో ప్రజలను మోసం చేస్తున్నారు. దీన్నే ‘ఏపీకే ఫ్రాడ్’ అని పిలుస్తున్నారు. ఈ మోసం గురించి దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లను అప్రమత్తం చేసింది.

సైబర్ నేరగాళ్ల కొత్త మోసం: ‘APK ఫ్రాడ్’తో మీ ఖాతాకు ప్రమాదం!

ఒక్క క్లిక్‌తో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త పద్ధతిలో ప్రజలను మోసం చేస్తున్నారు. దీన్నే ‘ఏపీకే ఫ్రాడ్’ అని పిలుస్తున్నారు. ఈ మోసం గురించి దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ తన కస్టమర్లను అప్రమత్తం చేసింది. తెలియని వ్యక్తులు పంపే ఫైల్స్ డౌన్‌లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

మోసం ఎలా చేస్తారంటే?

సైబర్ నేరగాళ్లు తమను తాము బ్యాంక్ ఉద్యోగులుగా లేదా ప్రభుత్వ అధికారులమని పరిచయం చేసుకుంటారు. తర్వాత మీకు ఎస్సెమ్మెస్ లేదా ఇతర మెసేజింగ్ యాప్స్ ద్వారా ఒక నకిలీ ఏపీకే ఫైల్ లింక్ పంపుతారు. ఈ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేస్తే, మీరు కేవైసీని అప్‌డేట్ చేయొచ్చని, ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ పొందొచ్చని లేదా జరిమానా చెల్లించవచ్చని నమ్మబలుకుతారు.

ఏం జరుగుతుందంటే?

ఆ లింక్‌ను క్లిక్ చేసి, యాప్‌ను ఇన్‌స్టాల్ చేయగానే మీ ఫోన్‌లోకి ఒక హానికరమైన సాఫ్ట్‌వేర్ (మాల్‌వేర్) ప్రవేశిస్తుంది. దీనితో మీ ఫోన్ నియంత్రణ పూర్తిగా మోసగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది.

  • మీ ఫోన్‌ కాల్స్‌ను వేరే నంబర్‌కు దారి మళ్ళిస్తారు.
  • మీకు వచ్చే మెసేజ్‌లను, ముఖ్యంగా ఓటీపీలను చదవగలరు.
  • మీ ఫోన్‌లోని ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తారు.

ఈ సమాచారం ఉపయోగించి, మీ బ్యాంక్ అకౌంట్ నుంచి తెలియకుండానే నిమిషాల్లో డబ్బును తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకుంటారు. మీ అకౌంట్ నుంచి డబ్బు పోయినట్లు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చిన తర్వాతే మీరు మోసపోయారని తెలుస్తుంది.

అప్రమత్తంగా ఉండటానికి చిట్కాలు

 

  • తెలియని వ్యక్తులు లేదా సంస్థలు పంపిన లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకండి.
  • మీ మొబైల్ ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి.
  • మీరు ఏ బ్యాంక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లినా, ఆ వెబ్‌సైట్ అసలు వెబ్‌సైట్ అవునో కాదో ఒకసారి నిర్ధారించుకోండి. సైబర్ నేరగాళ్లు హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రముఖ బ్యాంకుల వెబ్‌సైట్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టిస్తున్నారు.
  • బలమైన పాస్‌వర్డ్‌లు ఉపయోగించి మీ ఫోన్ భద్రతను పటిష్టం చేసుకోండి.
  • మీ బ్యాంక్ అకౌంట్‌లో ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగినట్లు గమనిస్తే, వెంటనే మీ బ్యాంక్‌కు సమాచారం ఇవ్వండి.
  • Read also:MeeraMitun : తమిళ నటి మీరా మిథున్ అరెస్ట్: మూడేళ్లుగా పరారీలో ఉన్న నటిని పట్టుకున్న ఢిల్లీ పోలీసులు

Related posts

Leave a Comment