AP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం: కీలక నిర్ణయాలు, చర్చలు:ఈ రోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
ఈ రోజు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది.
ఈ భేటీలో ప్రధానంగా ఎంతో కాలంగా రాష్ట్రంలో మహిళలు ఎదురుచూస్తోన్న ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆమోదం తెలుపనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. దీనిపై అధికారులు పూర్తి స్థాయి కసరత్తు పూర్తి చేశారు.
అంతర్రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు, మహిళా ఉద్యోగులు, ట్రాన్స్ జెండర్లకు కూడా ఈ సౌకర్యం కల్పించబోతున్నారు. దీని ద్వారా వారు జీరో టికెట్‌తో ఉచితంగా ప్రయాణించవచ్చు. రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం బస్సుల్లో 74 శాతం ఉన్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ కేటగిరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు.
అలాగే, పలు సంస్థలకు భూ కేటాయింపులు, నాలా చట్ట సవరణ, కొత్త రేషన్ కార్డుల జారీ, నూతన బార్ పాలసీ వంటి అంశాలపైనా కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఫ్రీహోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై సబ్ కమిటీ నివేదికపై కూడా చర్చించనున్నారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్‌లు జారీ చేసే అంశంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయంపై సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి నిన్న మీడియాకు తెలిపారు.
ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని బృందం ఇటీవల సింగపూర్ పర్యటనకు సంబంధించిన వివరాలను కూడా మంత్రివర్గంలో పంచుకోనున్నారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై, ముఖ్యంగా మద్యం కుంభకోణం కేసులో జరుగుతున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు. భారీ ఎత్తున నగదు బయట పడడం, అరెస్ట్‌లకు సంబంధించి కూడా చర్చ జరగనుంది.
Read also:AP : పర్యావరణానికి, రైతులకు మేలు చేసే ఇథనాల్ పెట్రోల్
