-
జస్టిస్ దత్తు స్థానంలో కొత్త సభ్యుడు
-
ఆయన బాధ్యతలు చేపట్టకపోవడంతో తాజా నిర్ణయం
-
కొత్త సభ్యుడిగా వేణుని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
పాలకమండలిలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త సుదర్శన్ వేణుని బోర్డులో కొత్త సభ్యుడిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నియమితులైన ఒక సభ్యుడు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఖాళీగా ఉన్న స్థానాన్ని ఈ నియామకంతో భర్తీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే, గతంలో రాష్ట్ర ప్రభుత్వం 29 మందితో టీటీడీ పాలకమండలిని ఏర్పాటు చేసింది. అయితే, అప్పట్లో సభ్యుడిగా ఎంపికైన జస్టిస్ హెచ్. ఎల్. దత్తు తన బాధ్యతలను స్వీకరించలేదు. దీంతో అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంది.
ఈ నేపథ్యంలో, ఖాళీగా ఉన్న 29వ సభ్యుడి స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. జస్టిస్ దత్తు స్థానంలో సుదర్శన్ వేణును నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులను విడుదల చేసింది. ఈ నియామకంతో టీటీడీ పాలకమండలి పూర్తిస్థాయిలో కొలువుదీరినట్లయింది. త్వరలోనే సుదర్శన్ వేణు సభ్యుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సుదర్శన్ వేణు ప్రస్తుతం టీవీఎస్ మోటార్స్ సీఎండీగా ఉన్నారు.
Read also : Samsung : శాంసంగ్ కొత్త స్మార్ట్ఫోన్ గెలాక్సీ ఎఫ్17 5జీ వచ్చేసింది!
