-
భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను దేశ ప్రజలందరూ బహిష్కరించాలని పిలుపు
-
ఎవరూ స్టేడియానికి వెళ్లి చూడవద్దని, టీవీలు కూడా ఆన్ చేయవద్దన్న ఐశాన్య
-
బీసీసీఐని, క్రికెటర్లను తప్పుబట్టిన ఐశాన్య
ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ను బహిష్కరించాలని పహల్గామ్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన సైనికుడు శుభమ్ ద్వివేది భార్య ఐశాన్య ద్వివేది దేశ ప్రజలను కోరారు. తమ కుటుంబాల వేదనను విస్మరించి, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడటం సరికాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. “దయచేసి ఈ మ్యాచ్‌ను బహిష్కరించండి. ఎవరూ స్టేడియానికి వెళ్లవద్దు, కనీసం ఇళ్లలో టీవీలు కూడా చూడొద్దు” అని ఆమె ప్రజలను కోరారు.
బీసీసీఐ, భారత క్రికెటర్ల వైఖరిని ఆమె తీవ్రంగా ఖండించారు. “ఉగ్రదాడిలో మరణించిన 26 కుటుంబాల పట్ల బీసీసీఐకి ఏ మాత్రం సానుభూతి లేనట్లుంది” అని ఆమె అన్నారు. అలాగే, దేశభక్తులైన మన క్రికెటర్లు పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడొద్దని ముందుకు రావడం లేదని విమర్శించారు.
ఈ మ్యాచ్ ద్వారా వచ్చే ఆదాయం మళ్లీ ఉగ్రవాదానికే వెళుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. “ఈ మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బును పాకిస్థాన్ ఉగ్రవాదం కోసమే వాడుతుంది. మనమే వారికి ఆదాయం అందించి, మళ్లీ మనపైనే దాడి చేయడానికి వారిని సిద్ధం చేసినట్లు అవుతుంది” అని ఐశాన్య అన్నారు. సెప్టెంబర్ 14న యూఏఈలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. బహుళ దేశాల టోర్నమెంట్లలో పాక్‌తో ఆడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ద్వైపాక్షిక సిరీస్‌లపై నిషేధం కొనసాగుతోంది.
Read also : MovieReview : తమన్నా, డయానా పెంటీ ‘డు యూ వాన్నా పార్ట్నర్’ రివ్యూ
