RGV : రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు: ‘దహనం’ వెబ్ సిరీస్‌తో మరో వివాదం

Ram Gopal Varma Lands in Trouble Again Over 'Dahanam' Series
  • వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీపై మరో కేసు

  • ‘దహనం’ వెబ్ సిరీస్‌పై రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు

  • అనుమతి లేకుండా తన పేరు వాడారని అంజనా సిన్హా ఆరోపణ

సంచలనాలకు, వివాదాలకు పెట్టింది పేరైన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆయన తీసిన ‘దహనం’ వెబ్ సిరీస్‌ విషయంలో ఆయనపై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.

పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి: ‘దహనం’ అనే వెబ్ సిరీస్‌లో మావోయిస్టుల నేపథ్యం ఉంటుంది. ఈ సిరీస్‌లో తన అనుమతి లేకుండా తన పేరును వాడేశారని రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి అంజనా సిన్హా ఆరోపించారు. ఈ విషయంలో ఆమె స్వయంగా పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు.

తనకు సమాచారం ఇవ్వకుండానే తన పేరును వెబ్ సిరీస్‌లో వాడటం పూర్తిగా అవాస్తవమని, ఇది తన పేరును దుర్వినియోగం చేయడమేనని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై వర్మపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. అంజనా సిన్హా ఫిర్యాదు మేరకు, రాయదుర్గం పోలీసులు రామ్ గోపాల్ వర్మపై ఐదు వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

Read also : Tirupati : తిరుపతిలో మహిళా ఆటో డ్రైవర్లు: సరికొత్త ప్రస్థానం

 

Related posts

Leave a Comment