Telangana : తెలంగాణ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ ల మధ్య వివాదం పరిష్కారం

Minister Ponnam Prabhakar Expresses Regret to Adluri Laxman; Vows to Work for Party Welfare.
  • అడ్లూరి లక్ష్మణ్ పై పొన్నం వ్యాఖ్యల వివాదం

  • ఇరువురినీ ఇంటికి పిలిపించుకున్న మహేశ్ గౌడ్ 

తెలంగాణ మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ ల మధ్య నెలకొన్న వివాదం సమసిపోయింది. పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్‌కు క్షమాపణ చెప్పి వివాదానికి ముగింపు పలికారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీ నిర్వహించిన సమావేశంలో పొన్నం ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం, దీనికి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇవ్వడం జరిగింది.

ఈ వివాదం కాస్తా ముదురుతుండడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. మంత్రులు ఇద్దరినీ తన నివాసానికి ఆహ్వానించి ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చారు. బుధవారం ఉదయం మహేశ్ గౌడ్ నివాసంలో భేటీ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు క్షమాపణలు చెప్పారు.

ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. “నేను ఆ వ్యాఖ్యలు చేయకపోయినా, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంతో మంత్రి అడ్లూరి మనస్తాపం చెందారు. అందుకే ఆయనకు క్షమాపణలు చెబుతున్నాను. అడ్లూరికి, నాకు పార్టీ సంక్షేమం తప్ప మరో ఉద్దేశం లేదు” అని అన్నారు.

Read also : Rashmika : రష్మిక మందన్న సంచలన వ్యాఖ్యలు: కన్నడ పరిశ్రమ నన్ను బ్యాన్ చేయలేదు!

 

Related posts

Leave a Comment