SuperVaccine : క్యాన్సర్‌ను నిరోధించే ‘సూపర్ వ్యాక్సిన్’అభివృద్ధి కొత్త ఆశలు చిగురించిన వైద్యరంగం

Breakthrough in Cancer Research: UMass Team Creates Prophylactic Vaccine
  • అమెరికా శాస్త్రవేత్తల పరిశోధనల్లో కీలక ముందడుగు

  • ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో సంపూర్ణ విజయం

  • శరీర కణాలతోనే రోగనిరోధక శక్తిని పెంచే ఫార్ములా

క్యాన్సర్ మహమ్మారిని జయించే దిశగా వైద్య రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. క్యాన్సర్ సోకకముందే దానిని నిరోధించే ఒక ‘సూపర్ వ్యాక్సిన్’ను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మసాచుసెట్స్ అమ్హెర్స్‌ట్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ఈ టీకా ప్రయోగశాలలో ఎలుకలపై అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది.

ఈ వ్యాక్సిన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థకు శిక్షణ ఇస్తుంది. క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉన్న అసాధారణ కణాలను గుర్తించి, అవి కణితులుగా (ట్యూమర్లుగా) మారకముందే నాశనం చేసేలా రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది. ఈ వ్యాక్సిన్‌ను శరీరంలోని కణాలతో పాటు, రోగనిరోధక ప్రతిస్పందనను బలంగా పెంచే ఒక ప్రత్యేక ఫార్ములా (‘సూపర్ అడ్జువెంట్’)తో తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఈ టీకా తీసుకున్న చాలా వరకు జంతువులు ఆరోగ్యంగా ఉండగా, టీకా వేయనివి క్యాన్సర్ బారిన పడ్డాయి. ఇది కేవలం ఒక రకం క్యాన్సర్‌పైనే కాకుండా మెలనోమా, ప్యాంక్రియాటిక్, బ్రెస్ట్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన క్యాన్సర్లను కూడా నిరోధించినట్లు తేలింది. అంతేకాకుండా, ఇది కొత్త కణుతులు ఏర్పడకుండా ఆపడంతో పాటు, క్యాన్సర్ కణాలు శరీరంలోని ఊపిరితిత్తులు, మెదడు వంటి ఇతర భాగాలకు వ్యాపించకుండా (‘మెటాస్టాసిస్’) కూడా అడ్డుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.

జంతువులపై ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఈ పరిశోధన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. మనుషులపై ప్రయోగాలు జరగడానికి దశాబ్దాల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ మనుషులకు ఎంతవరకు సురక్షితం, దాని దుష్ప్రభావాలు, మోతాదు వంటి విషయాలపై ఇంకా విస్తృతమైన పరిశోధనలు జరగాల్సి ఉందని వారు పేర్కొన్నారు.

Read also : Diwali : ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్‌కు సుప్రీంకోర్టు షరతులతో కూడిన అనుమతి: నాలుగు రోజులే వెసులుబాటు

Related posts

Leave a Comment