సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి
Samantha marries Director Raj Nidimoru : టాలీవుడ్ అగ్ర నటి సమంత రూత్ ప్రబు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం కోయంబత్తూరులో జరగినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా ఆధ్యాత్మిక కేంద్రం యోగా సెంటర్‌లో అత్యంత సన్నిహితులకు మాత్రమే పరిమితమైన సింపుల్ వేడుకలో ఈ జంట మంగళ్య ధారణ చేసినట్లు తెలుస్తోంది.
ఈ రోజు సాయంత్రం ఇద్దరూ తమ వివాహాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించే అవకాశముందని కూడా సమాచారం.
గత కొన్ని నెలలుగా సమంత – రాజ్ నిడిమోరు ప్రేమలో ఉన్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశం. అమెజాన్ ప్రైమ్ కోసం రాజ్–డీకే రచన, దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లలో సమంత కీలక పాత్రలు పోషించారు. ఈ కోలాబరేషన్ సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమగా మారినట్లు చెప్పబడుతోంది. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ సంబంధంపై వార్తలకు మరింత బలం చేకూరింది.
వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి. అందులో సమంత ఎర్రచీరలో సంప్రదాయబద్ధంగా కనిపించగా, రాజ్ నిడిమోరూ సాధారణ దుస్తుల్లో సింపుల్‌గా కనిపించారు. నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత వ్యక్తిగత జీవితం తరచూ హాట్ టాపిక్ అవుతుండగా, ఇప్పుడు కొత్త వివాహంపై వస్తున్న నివేదికలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి.
సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ జంట నుంచి అధికారిక ప్రకటన కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
