Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

గ్రూప్ 1 పై అశ్రద్ధ ఎందుకు.. హైకోర్టు ప్రశ్న

0

గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించకపోవడం, ఓఎంఆర్ షీటుపై హాల్‌టికెట్, ఫొటో లేకపోవడం అనుమానాస్పదంగా ఉందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తెచ్చారు. ఓఎంఆర్ షీటుపై హాల్‌టికెట్ నంబర్, ఫొటో ఎందుకు లేవని, అభ్యర్థుల బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని టీఎస్‌పీఎస్సీని హైకోర్టు ప్రశ్నించింది. అక్టోబరులో చేసినవన్నీ రెండోసారి ఎందుకు చేయలేదు, పరీక్షల్లో అక్రమాల నిరోధించడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారని ధర్మాసనం అడిగింది.పరీక్షల ఏర్పాట్లు ఎలా చేయాలన్నది టీఎస్‌పీఎస్సీ విచక్షణ అధికారమన్న కమిషన్ తరఫు న్యాయవాది.. బయోమెట్రిక్‌, ఓఎంఆర్‌పై ఫోటోకు సుమారు రూ.1.50 కోట్లు ఖర్చవుతోందని తెలిపారు.

 

పరీక్షల ఏర్పాటు ఎలా చేయాలన్నది టీఎస్‌పీఎస్సీ విచక్షణాధికారమని కోర్టుకు వివరించారు. అనుభవం, నైపుణ్యంతో కమిషన్‌ తగిన ఏర్పాట్లు చేసిందన్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను దాదాపు 3.80 లక్షల మంది అభ్యర్థులు రాయగా, అందులో కేవలం ముగ్గురు మాత్రమే పిటిషన్‌ వేశారని, మిగతా వారెవరూ అభ్యంతరాలు చెప్పలేదని టీఎస్‌పీఎస్సీ వాదించింది. పరీక్షలో ఎలాంటి అక్రమాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు జరిగాయని, ఆధార్‌, పాన్‌ వంటి గుర్తింపు కార్డుల ద్వారా ఇన్విజిలేటర్లు అభ్యర్థులను ధ్రువీకరించుకొని పరీక్షను నిర్వహించారని కోర్టుకు టీఎస్‌పీఎస్‌సీ వివరించింది.పరీక్ష నిర్వహణ విషయంలో ఖర్చులు ముఖ్యం కాదని, పరీక్ష పారదర్శకంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయడం టీఎస్‌పీఎస్సీ బాధ్యత అని ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

 

పరీక్ష నిర్వహణకోసం అభ్యర్థుల నుంచి ఫీజు తీసుకున్నారు కదా? అని ప్రశ్నించింది. పరీక్షల్లో అక్రమాలను నిరోధించేందుకు ఒకరి బదులు మరొకరు రాయకుండా ఉండేందుకు బయోమెట్రిక్‌, ఫోటో, హాల్‌టికెట్‌ నెంబర్‌ వంటి కీలక అంశాలు అవసరం కదా అని పేర్కొంది. అలాంటి వాటిని విస్మరిస్తే ఎలాని పేర్కొంది. వీటన్నింటిపై 3 వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.తెలంగాణలో జూన్ 11న నిర్వహించిన ‘గ్రూప్‌-1’ ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించేలా ఆదేశించాలంటూ బుధవారం(జూన్‌ 21) హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్‌కు చెందిన బి.ప్రశాంత్‌ మరో ఇద్దరు అభ్యర్థులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం(జూన్‌ 22) విచారణ జరిగే అవకాశం ఉంది.

మమతా, మల్లారెడ్డి కళాశాలలపై సోదాలు నగదు, కీలక పత్రాలు స్వాధీనం.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు గతంలోనే నిరాకరించిన సంగతి తెలిసిందే. తాజాగా పరీక్ష ముగిసిన తర్వాత తొలిసారి పిటిషన్ నమోదైంది.”అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోకుండా జూన్‌ 11న పరీక్షలు నిర్వహించారు. ఓఎంఆర్‌ షీట్‌లో హాల్‌టికెట్‌ నంబరు కూడా లేదు. అలాంటి ఓఎంఆర్‌ షీట్‌ ఎవరికి ఏది ఇచ్చారో గుర్తించడం కష్టం. వాటిని తారుమారు చేయడానికి ఆస్కారాలున్నాయి. పరీక్షల నిర్వహణలో అనుసరించిన విధానం సరిగాలేదు. గతంలో ప్రశ్న పత్రాలు లీకై రద్దవగా మరోసారి ఏదో నిర్వహించాలన్నట్లుగా నిర్వహించడం సరికాదు. పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ జూన్‌ 13న వినతి పత్రం ఇచ్చినా టీఎస్‌పీఎస్సీ కనీసం సమాధానం ఇవ్వలేదు” అని పిటిషన్‌లో పేర్కొన్నారు.తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 11న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు.

 

ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందునుంచే పరీక్ష కేంద్రాల వద్ద గేట్లు మూసివేశారు. పరీక్షకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను తిరిగి వెనక్కి పంపారు.ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 61.16 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గ్రూప్-1 పోస్టుల భర్తీకి  మొత్తం 3.80 లక్షల మందికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో 501 గ్రూప్-1 పోస్టుల భర్తీకి జూన్ 11న మొత్తం 994 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు.  ప్రశ్న పత్రం లీకేజీ కారణంగా గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేయడంతో మళ్లీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష కోసం 994 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన లోటుపాట్లు, గందరగోళం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie