Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

బండి సంజయ్ – కవిత ట్విటర్ వార్, అసలు ఎవరూ తగ్గట్లేదుగా!

0

బీఆర్ఎస్, తెలంగాణ బీజేపీ అగ్రనేతలు ట్విటర్ వేదికగా కౌంటర్లు విసురుకున్నారు. బండి సంజయ్ తొలుత బీఆర్ఎస్ విధానాలను విమర్శిస్తూ ఒక ట్వీట్ చేయగా, అందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీటుగా స్పందించారు. ఆయన సంధించిన విమర్శలకు అంతే దీటుగా కవిత రిప్లై ఇచ్చారు. అంతటితో ఆగకుండా బండి సంజయ్ కవిత ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ఇంకొన్ని విషయాలను లేవనెత్తారు. మొత్తానికి బండి సంజయ్, కవిత మధ్య ట్విటర్ వార్ ఏర్పడింది.బండి సంజయ్ చేసిన ట్వీట్ లో ‘‘గవర్నర్ కు దక్కదు గౌరవం, ఆడబిడ్డలకు లేదు అండ, గిరిజన మహిళలపై పోలీస్‌ గిరీ, బతుకమ్మను అవమానపరిచినోడితో ఆలింగనం, ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతవ్ అడ్డం.

 

అదిరింది కేసీఆర్ నీ మహిళా సంక్షేమం’’ అని బండి సంజయ్ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ పై కల్వకుంట్ల కవిత స్పందిస్తూ.. ‘‘పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం, దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు, దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం, నినాదాలకే పరిమితమైన భేటీ బచావో… భేటీ పడావో, సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్ లో కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి, మహిళకు విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం, ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం, ఆడబిడ్డ తలుచుకుంది.. ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది’’ అని కవిత కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు.

బహుజనులకు రాజ్యాధికారమే బీఎస్పీ అంతిమ లక్ష్యం -బిసిలకు 70 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తాం -బీఎస్పీ మంథని నియోజకవర్గం ఇంచార్జి జనగామ రవి కుమార్

అంతటితో ఆగకుండా బండి సంజయ్ కవితకు రిప్లై ఇచ్చారు. ‘‘సొంత పార్టీలో మహిళా నేతలపైనే అకృత్యాలకు పాల్పడే గులాబీ కీచకులపై మౌనం, ఆడబిడ్డలను వేధించి పీడించి ప్రాణాలు తీసుకునే స్థితికి చేరినా ఆ నేతలపై చర్యలు శూన్యం, పోడు భూముల కోసం పోరుబాట పట్టిన ఆడబిడ్డల చేతికి సంకెళ్ళేసిన వైనం, పసి బిడ్డ నుండి పండు ముసలి వరకూ ఎవరికీ లేని రక్షణ, తొలి క్యాబినెట్లో కనీసం ఒక్క మహిళలకూ దక్కని ప్రాతినిధ్యం, పాయఖానాలు సైతం లేక ఆడకూతుర్లు అవస్థలు పడుతుంటే స్పందించని నిర్లక్ష్యం, డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో దగా చేసి మహిళల్ని గోస పెడుతూ అలసత్వం, బాలింతలు మృతి చెందినా పరామర్శించని కర్కశత్వం, రాజకీయాల కోసం మహిళా బిల్లంటూ వీధులకెక్కి నాటకాలు చేస్తున్న తీరుని తెలంగాణ మహిళా లోకం ఏనాడో పసిగట్టింది.. గులాబీ పార్టీ పని పడుతుంది’’ అని బండి సంజయ్ మరో ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie