Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు BRO Movie ఫుల్ మీల్స్

Bro Movie Genuine Review And Rating

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరం తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బ్రో భారీ లెవల్ లో రిలీజ్ అయింది. Pawan Movie Review పవన్ కళ్యాణ్ సినిమా అంటే రిలీజ్ టైం అన్నీ సెట్ అయ్యి బజ్ ఆటోమాటిక్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అలాంటి బజ్ ఉండగా సినిమా ఆ బజ్ కి తగ్గట్లు మెప్పించిందో లేదో చూదాంరండి …

ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే…
లైఫ్ లో వర్క్ కి తప్ప మిగిలిన వ్యక్తులకు టైం లేని సాయి ధరం తేజ్ ఒక యాక్సిడెంట్ లో చనిపోతాడు. అప్పుడు టైం గాడ్ అయిన పవన్ కళ్యాణ్ ని కలుసుకుంటాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఒక వరాన్ని ఇస్తాడు… ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

పెర్ఫార్మెన్స్ పరంగా….

పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు, ఇలా దేవుడు భక్తుడు లాంటి కాన్సెప్ట్ మూవీస్ లో దేవుడు కొన్ని సీన్స్ కే పరిమితం అవుతూ ఉంటాడు కానీ ఇక్కడ పవన్ ముందే చెప్పినట్లు దాదాపు 80% సీన్స్ లో కనిపిస్తాడు….తన స్టైల్, స్వాగ్, ఎనర్జీ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంటాయి. సాయి ధరం తేజ్ పర్వాలేదు అనిపించగా మిగిలిన యాక్టర్స్ అందరూ చిన్న చిన్న రోల్స్ లో ఓకే అనిపిస్తారు.

పాటల విషయంలో…
తమన్ నిరాశ పరచగా బ్రో థీమ్ సాంగ్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి…

సినిమాలో ప్లస్ పాయింట్స్
విషయానికి వస్తే పవన్ కళ్యాణ్, డైలాగ్స్ బాగుండటం, బ్యాగ్రౌండ్ స్కోర్ మెప్పించడం, ఫస్టాఫ్ లో ఎంటర్ టైన్ మెంట్ అలాగే క్లైమాక్స్ పార్ట్ లాంటివి ప్లస్ పాయింట్స్.

సినిమాలో మైనస్ పాయింట్స్
సెకెండ్ ఆఫ్ డ్రాగ్ చేయడం, సాంగ్స్, VFX వర్క్, ఓవర్ ది టాప్ సీన్స్, ఎమోషన్స్ కనెక్ట్ కాక పోవడం లాంటివి మేజర్ మైనస్ పాయింట్స్.

ఫ్యాన్స్ కి సినిమా మొత్తం మీద చాలా వరకు సాటిస్ ఫై చేస్తుంది, కానీ మిగిలిన ఆడియన్స్ కి మాత్రం సినిమా కొంచం ఓపికతో చూస్తె సినిమా అయ్యే టైంకి ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది. మొత్తం మీద సినిమాకి మేం ఇస్తున్న

రేటింగ్ 3/5 స్టార్స్

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie