మార్క్ చూపించేసిన జితేందర్ హైదరాబాద్, జూలై 12, (న్యూస్ పల్స్) Jitender who showed the mark తెలంగాణ కొత్త పోలీస్ బాస్‌గా జితేందర్ నియమితులయ్యారు. 1992 బ్యాచ్‌కు చెందిన ఆయన అనూహ్యంగా తెరపైకి వచ్చారు. సీనియారిటీ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న జితేందర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి కొత్త పోలీస్‌బాస్‌గా నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వెంటనే సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఆయన బాధ్యలు చేపట్టారు. రేవంత్‌రెడ్డి అనుమతి ఇవ్వడంతోనే ఉత్తర్వుల జారీ, బాధ్యతల స్వీకరణ చకచకా జరిగాయి. ఇక కొత్త డీజీపీగా బాధ్యతలు చేపట్టిన జితేందర్ వెంటనే తన మార్కు పాలన మొదలు పెట్టేవారు. తనకు అవసరమైన టీంను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ…
Read MoreCategory: తెలంగాణ
Telangana
Silence among the pink leaders | గులాబీ నేతల్లో మౌనం… | Eeroju news
గులాబీ నేతల్లో మౌనం… హైదరాబాద్, జూలై 12, (న్యూస్ పల్స్) Silence among the pink leaders పదేళ్ల అధికారం తర్వాత ప్రతిపక్షంలో కూర్చున్న భారత రాష్ట్ర సమితికి ఫిరాయింపుల భయం పట్టుకుంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. త్వరలో లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసుకుంటామంటూ కాంగ్రెస్ సవాల్ చేస్తోంది. ఇంకోవైపు పార్టీ అధినేత కేసీఆర్ చుట్టూ కేసుల ఉచ్చు బిగిసుకుంటోంది. మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఇంకా బెయిల్ రాక జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న రెండు పార్టీలకు బీఆర్ఎస్ ప్రత్యర్థిగా ఉంది. దీంతో ఈ రానున్న రోజులు మరింత పార్టీకి గడ్డుకాలంగా కనిపిస్తుందని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఇన్ని పరిణామాల మధ్య పార్టీ కీలక నేతలు కేటీ రామారావు, హరీష్ రావు…
Read Moreloan waiver | ఐటీ పేయర్స్ కు నో రుణమాఫీ | Eeroju news
ఐటీ పేయర్స్ కు నో రుణమాఫీ హైదరాబాద్, జూలై 12, (న్యూస్ పల్స్) loan waiver ఆగస్టు 15లోగా ఎట్టిపరిస్థితుల్లోనూ రైతుల రుణాలు మాఫీ చేయాలని సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం..అందుకు తగ్గట్లుగా లబ్ధిదారుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. పేద రైతులెవ్వరూ నష్టపోకూడదంటూనే…అనర్హులకు సైతం ఒక్కపైసా ముట్టచెప్పకూడదని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను గట్టిగానే హెచ్చరించారు. దీంతో రైతు రుణమాఫీమార్గదర్శకాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆదాయపన్ను చెల్లింపుదారులను రాజకీయ నేతలను, ప్రభుత్వ ఉద్యోగులను మినహాయించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐటీ రిటర్న్ దాఖలు చేసే రైతులు, చిరు ఉద్యోగులను మాత్రం ఇందులో నుంచి మినహాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతు రుణమాఫీకి అర్హత పొందే లబ్ధిదారుల లెక్కలు తేల్చే పనిలో నిమగ్నమైన వ్యవసాయశాఖ అధికారులు…పకడ్బందీగా మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. దీని ప్రకారం అసలు రాష్ట్రంలో ఐటీ కడుతున్న వారు ఎంతమంది..? పన్ను…
Read MoreSlightly increased water level in Bhadradri | భద్రాద్రిలో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం | Eeroju news
భద్రాద్రిలో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం భద్రాద్రి కొత్తగూడెం Slightly increased water level in Bhadradri భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం స్వల్పంగా పెరుగుతుంది. మూడు రోజుల క్రితం 4,లేదా 5 అడుగుల మేర ప్రవహించి స్వల్పంగా పెరిగిన గోదావరి నీటిమట్టం ఈరోజు ఉదయానికి 11.5 అడుగులు చేరి ప్రవహిస్తోంది. కొన్ని రోజులుగా నీటిమట్టం తక్కువగా ఉండి ప్రవహించిన గోదావరి ఎగువన కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి వర్షపునీరు రావడంతో తాలిపేరు వద్ద అన్ని గేట్లను వదిలి దిగువన ఉన్న గోదావరి లోనికి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం 11.5 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం…
Read MoreUjjain Mahakali in Shakambari Devi Alankaram | శాకంబరీ దేవి అలంకారంలో ఉజ్జయిని మహంకాళి | Eeroju news
శాకంబరీ దేవి అలంకారంలో ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ Ujjain Mahakali in Shakambari Devi Alankaram శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారు శుక్రవారం రోజున శాకంబరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వ్వమనున్నారు. ఈ మేరకు ఆలయ కార్య నిర్వహణ అధికారి గుత్తా మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయం లో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ఆషాడ బోనాల జాతరలో భాగంగా ఇప్పటికే అమ్మవారి ఘటోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా ప్రారాంబమై కొనసాగుతుంది. ఆలయానికి రాలేని భక్తులు అమ్మవారిని తమ ఇళ్ళ ముందే దర్శించుకుని పూజలు నిర్వహించుకునే విధంగా ఘటాన్ని పురవీధుల్లో ఊరేగిస్తారు. ఇప్పటికే పలు వీధుల్లో అమ్మవారి ఘటం భక్తులకు దర్శనమిచ్చింది. శుక్రవారం అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులుకు దర్శనం ఇవ్వ నున్నారు.అమ్మవారిని చూసి పూజలు నిర్వహించేందుకు జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల…
Read MoreSeizure of spoiled cheese and milk | పాడయిన పన్నీరు, పాలు స్వాధీనం | Eeroju news
పాడయిన పన్నీరు, పాలు స్వాధీనం కిచెన్ లో తిరుగుతున్న ఎలుకలు, పందికొక్కులు ఇదీ పేరుగాంచిన ఎమరాల్డ్ స్వీట్స్ భాగోతం హైదరాబాద్ Seizure of spoiled cheese and milk హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇందిరా పార్క్ సమీపం గల ఎమ్రాల్డ్ స్వీట్స్ లో జిహెచ్ఎంసి ఫుడ్ సేఫ్టీ తనిఖీలు జరిగాయి. స్వీట్ల తయారీలో పేరుగాంచిన ఎమరాల్డ్ స్వీట్స్ షాప్ కిచెన్ లో దారుణమైన పరిస్థితులు బయటపడ్డాయి. కంపు కొడుతూ దుర్గంధ భరితమైన వాతావరణంలో స్వీట్ల తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. రోజుల తరబడి ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన పాలు, పెరుగు, పన్నీర్ సీజ్ చేసారు. స్వీట్ల తయారీలో మోతాదుకు మించి ఫుడ్ కలర్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. కిచెన్ లో ఎలుకలు, పందికొక్కులు తిరుగుతున్నాయి. దాంతో ఎమరాల్డ్ స్వీట్స్ తయారీ నిర్వాకులపై…
Read MoreKTR Self-political existence is Sri Ramaraksha for Telangana | స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష | Eeroju news
స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హైదరాబాద్ జూలై 11 KTR Self-political existence is Sri Ramaraksha for Telangana చంద్రబాబు, నితీశ్ కుమార్ కు చెందిన పార్టీలు మద్దతు ఇవ్వకపోతే మోడీ ప్రభుత్వం గట్టెక్కేదే కాదు. ఆ విషయం అందరికీ తెలుసు. కాగా చంద్రబాబు నాయుడు తన డిమాండ్లను మోడీ ముందుంచి నెరవేర్చుకునే పనిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధికి రూ. 1 ట్రిలియన్ కోరారని సమాచారం. అంటే లక్ష కోట్ల రూపాయలు. ఈ వార్త బ్లూమ్ బర్గ్ వెబ్ సైట్ ప్రకటించింది. దానికి సంబంధించిన కథనాన్ని మనేకా దోశి అనే జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జర్నలిస్ట్ మనేకా ట్వీట్ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. ప్రాంతీయ పార్టీలను గెలిపించుకుంటే కేంద్రంలో…
Read More70 years 70 feet Ganesha | 70 ఏళ్లు… 70 అడుగుల వినాయకుడు | Eeroju news
70 ఏళ్లు… 70 అడుగుల వినాయకుడు హైదరాబాద్, జూలై 11 (న్యూస్ పల్స్) 70 years 70 feet Ganesha వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా సెప్టెంబరు 07 శనివారం వినాయక చవితి. విగ్రహాల తయారీ జోరందుకుంటోంది. ఊరూరా కొలువుతీరే మండపాలన్నీ ప్రత్యేకమే అయినా.. ఖైరతాబాద్ గణేష్ సందడే వేరు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ వినాయకుడికి విగ్రహం ఈ ఏడాది 70 అడుగులు రూపుదిద్దుకోనుంది. నిర్జల్ ఏకాదశి సందర్భంగా ఇప్పటికే కర్రపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సరిగ్గా వినాయకచవితికి వారం ముందు స్వామివారి విగ్రహం పూర్తిస్థాయిలో సిద్ధమవుతుందని ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు పూజలందుకోనున్నాడు ఈ మేరకు ప్రధాన శిల్పి చినస్వామి రాజేంద్రన్ సహా నిపుణులంతా ఇప్పటికే పనుల్లో వేగం…
Read MorePower reservoir in Illendu | ఇల్లెందులో పవర్ రిజర్వాయర్ | Eeroju news
ఇల్లెందులో పవర్ రిజర్వాయర్ ఖమ్మం, జూలై 11 (న్యూస్ పల్స్) Power reservoir in Illendu తెలంగాణలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి. బొగ్గు ఉత్పత్తితోపాటు థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తితో మహారత్న కంపెనీలకు దీటుగా లాభాలు గడిస్తోంది. తాజాగా వినూత్న ఆలోచనతో తెలంగాణలో పవర్ రిజర్వాయర్ నిర్మాణానికి సిద్ధమవుతోంది. సంస్థతోపాటు రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో భాగస్వామి కావాలని భావిస్తోంది.సాధారణంగా రిజర్వాయర్ అంటే.. మనకు ఆనకట్టలు, డ్యాంలు గుర్తొస్తాయి. కానీ, పవర్ రిజర్వాయర్ పేరుతో సింగరేణి కొత్తరకంగా విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకు బొగ్గు నిల్వలు పూర్తయిన గనిని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఇందులో పీఎస్పీపీ(పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్) నిర్మించబోతోంది. దిగువన ఒక రిజర్వాయర్, పైన ఒక రిజర్వాయర్ నిర్మించి విద్యుత్ డిమాండ్ తక్కువగా(ఆఫ్ పీక్ అవర్స్) ఉన్నప్పుడు కింది రిజర్వాయర్ నుంచి నీటిని…
Read MoreDenial of permission to medical colleges | మెడికల్ కాలేజీలకు అనుమతి నిరాకరణ | Eeroju news
మెడికల్ కాలేజీలకు అనుమతి నిరాకరణ హైదరాబాద్, జూలై 11 (న్యూస్ పల్స్) Denial of permission to medical colleges రేవంత్ రెడ్డి సర్కారుకు నేషనల్ మెడికల్ కమిషన్ షాకిచ్చింది. రాష్ట్రంలో ఎనిమిది కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అనుమతి నిరాకరించింది. 2024-25 విద్యాసంవత్సరానికిగానున గద్వాల, మెదక్, ములుగు, షాద్‌నగర్, నారాయణపేట, యాదాద్రి, కుత్బుల్లాపూర్, నర్సంపేటలలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటకు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ దరఖాస్తు చేసుకుంది. ఒక్కో కాలేజీలో 50 సీట్లు కేటాయించాలని కోరింది. అయితే, అవసరమైన నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారంటూ అనుమతిచ్చేందుకు ఎన్‌ఎంసీ నిరాకరించింది. నిబంధనల ప్రకారం.. కొత్తగా 50 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల ఏర్పాటు కావాలంటే.. 14 మంది ప్రొఫెసర్లు, 20 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. అంటే మొత్తంగా…
Read More