రాత పరీక్షా లేకుండానే ఉద్యోగాలు ఇవ్వాలి | Jobs should be given without written test | Eeroju news

సీఐటీయూ జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన కలెక్టరేట్ ఎదుట సిఐటియూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల నిరసన జగిత్యాల ఆశా వర్కర్లకు ఎలాంటి రాత పరీక్షా లేకుండానే ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జగిత్యాల జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన ప్రభుత్వాన్ని కోరారు. ఆశాలకు నష్టం కలిగించే  విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జామ్ పెట్టే నిర్ణయాన్ని  ఉపసంహరించుకోవాలని సులోచన డిమాండ్ చేశారు.ఆశా వర్కర్ల డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా గురువారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ నిరసనకు  సీఐటీయూ నాయకులు పూర్తి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ ఇందూరి సులోచన మాట్లాడుతూ  అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచించారు. ఆశాలకు టార్గెట్ ఇస్తూ పని ఒత్తిడి తీసుకువస్తూ…

Read More

బండి సంజయ్ “హోం” బాధ్యతల స్వీకరణ | Bandi Sanjay takes charge of “Home” | Eeroju news

న్యూఢిల్లీ కేంద్ర హోం శాఖ సహయ మంత్రిగా బండి సంజయ్ బాధత్యలుస్వీకరించారు. సరిగ్గా 11 గంటలకు నార్త్ బ్లాక్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు.  పదవీ బాధ్యతల కార్యక్రమానికి హాజరై వేద మంత్రోఖ్చరణలతో బండి సంజయ్ కు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ ఆశిస్సులు అందచేసారు. బండి సంజయ్ కు సహచర మంత్రి నిత్యానంద రాయ్ పూల బొకే అందించి అభినందనలు తెలిపారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా అత్యంత నిరాడంబరంగా అయన బాధ్యతలు  తీసుకున్నారు. అంతకు ముందు తన అధికారిక నివాసంలో బండి సంజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు బీజేపీ  నాయకులు, కార్యకర్తలు  తెలంగాణ నుండి భారీగా తరలివచ్చారు. పూలబొకేలు, శాలువాతో సత్కరించి  స్వీట్లు…

Read More

కోదాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు | Telugu Desam Party Lines in Kodada Constituency | Eeroju news

సూర్యాపేట జిల్లా, జూన్ 12 తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేయుచున్న సందర్భంగా కోదాడ రూరల్ మండలం  గుడిబండ గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో డిసిసిబి మాజీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు మాట్లాడుతూ, పార్టీలు వేరైనా లక్షల మంది గుండెల్లో నందమూరి తారక రామారావు  అభిమానం కలదు అన్నారు . కోదాడ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఓరుగంటి ప్రభాకర్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం నేర్పింది , సంక్షేమ పథకాలను ప్రారంభించింది ఎన్టీ రామారావు అన్నారు. నారా చంద్రబాబునాయుడు  పాలనలో బీసీలకు  రాజ్యాధికారము కల్పించినారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా ఆవిర్భవించింది అంటే దానికి చంద్రబాబు నాయుడు…

Read More

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ | Big shock for former minister, Medchal MLA Mallareddy | Eeroju news

మేడ్చల్  జూన్ 12 బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సుచిత్ర పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 82లో ఉన్న ల్యాండ్ 33 గుంటల స్థలం మల్లారెడ్డి కాదని రెవిన్యూ అధికారులు తేల్చారు. ఈ మేరుకు బుధవారం హైకోర్టుకు రెవెన్యూ అధికారులు నివేదిక అందజేశారు. సైబరాబాద్ పోలీసులకు సర్వే రిపోర్ట్ ను పంపించారు.అయితే.. దశాబ్ద కాలంగా అది తన భూమి అపి మల్లారెడ్డి అంటున్నారు. సర్వే నెంబర్ 82లో ఉన్న ల్యాండ్ పై 15 బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సర్వే చేపట్టిన రెవిన్యూ అధికారులు.. ఆ భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు తేల్చారు.

Read More

జీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం | Minister Ponnam Prabhakar is angry with GHMC officials | Eeroju news

హైదరాబ్నాద్ జూన్ 12 జీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి పొన్నం జీహచ్ఎంసీ అధికారులతో సమీక్ష నిర్వహిచారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వర్షాకాలం నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారని జీహచ్ఎంసీ, వాటర్ బోర్డ్ అధికారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వర్షాకాలం ప్లాన్ ను అధికారులు మంత్రికి తెలియజేశారు. ముందస్తు చర్యలపై అధికారుల సమాధానంపై పొన్నం అసహనం వ్యక్తం చేశారు.వాటర్ లాగింగ్ పాయింట్స్ కంటే ఎక్కువ చోట్ల ఎందుకు నీళ్ళు ఆగుతున్నాయని అధికారులు ప్రశ్నించారు. నగరంలో శానిటేషన్ అధ్వన్నంగా ఉందని.. అధిక సంఖ్యలో ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయని మంత్రి నిలదీశారు. నగరంలో సాయంత్రం పీక్ అవర్స్ లో ట్రాఫిక్ పోలీసులు తప్పనిసరిగా ఫీల్డ్ మీదే ఉండాలని చెప్పారు.

Read More

పెరిగిన ఆర్టీసీ బస్సు టిక్కెట్లు | Increased RTC bus tickets | Eeroju news

హైదరాబాద్, జూన్ 12, (న్యూస్ పల్స్) తెలంగాణలో మరో సారి ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. హైవేలపై టోల్ చార్జీలు పెంచుతూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో జాతీయ రహదారులపై అన్ని టోల్‌గేట్లలో ఈ రుసుములు స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఆర్టీసీ టికెట్‌ చార్జీల్లో టోల్‌ గేట్‌ రుసుములు పెరిగాయి. టోల్‌ ప్లాజాలు ఉన్న మార్గాల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో రూ.3 చొప్పున చార్జీలు పెరిగాయి. టోల్ గేట్లు ఉన్న రహదారుల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సులు కూడా టోల్‌ రుసుములు చెల్లించాల్సి ఉంది. కేంద్రం నిర్ణయంతో టోల్‌ గేట్‌ చార్జీలు పెరగడంతో ఆర్టీసీ ఆ భారాన్ని ప్రయాణికులపైనే మోపింది. టికెట్‌ చార్జీల్లో కలిసి ఉన్న టోల్‌ రుసుములను రూ.3 చొప్పున పెంచింది. ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రూ.10గా ఉన్న టోల్‌రుసుమును రూ.13కు,…

Read More

టెట్ ఫలితాలు రిలీజ్ | Tet results release | Eeroju news

హైదరాబాద్, జూన్ 12, (న్యూస్ పల్స్) తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్  ఫలితాలు బుధవారం (జూన్ 12) వెలువడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ జర్నల్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. పరీక్షలు పూర్తయిన పదిరోజుల్లోనే టెట్ ఫలితాలను విడుదల చేయడం విశేషం.టెట్-2024 ఫలితాలకు సంబంధించి మొత్తం 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్-1పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 అభ్యర్థులు అర్హత సాధించారు. ఇక పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13% అర్హత నమోదుకాగా.. పేపర్-2లో 34.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు. టెట్-2023 ఫలితాలతో పోల్చితే పేపర్-1లో 30.24 శాతం,…

Read More

ఇచ్చిన మాట ప్రకారం ఉపాధ్యయ ఖాళీలు నింపాలి | According to the given word, Upadhyaya should fill the blanks | Eeroju news

సిద్దిపేట పాఠశాలల ప్రారంభం నేపథ్యంలో సిద్దిపేట ప్రభుత్వ బాలుర పాఠశాలలో విద్యార్థులకు బుక్స్ యూనిఫామ్స్  మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పంపిణీ చేసారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 వేలకు పైన పాఠశాలలు పునర్ ప్రారంభం అవుతున్న సందర్భంగా విద్యార్థులకు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చినప్పుడు వారి జీవితం మారుతుంది. ప్రజా ప్రతినిధిగా మేము, ఉపాధ్యాయులు శ్రద్ధ చూపినప్పుడే వారికి మంచి జరుగుతుంది.  రాష్ట్రం లో గత ఐదు సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లా పదో తరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచింది. అభివృద్ధిలో విద్యలో ఏ రంగంలో అయినా సిద్ధిపేట జిల్లా రాష్ట్రంలో  అగ్రగామిగా నిలుస్తూ వస్తున్నది. సిద్దిపేటలో ఉన్నటువంటి అన్ని…

Read More

ప్రతి రోజూ పాఠశాలల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ పీరియడ్, లైబ్రరీ ఉండేలా చర్యలు | Actions are taken to have sports period and library for students every day in schools | Eeroju news

-పాఠశాల గేట్ ఏర్పాటుకు 50 వేల రూపాయల చెక్కు అందజేత -పాఠశాలకు విద్యార్థులు రెగ్యులర్ గా హాజరు కావాలి -విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత అంశంలో రాజీపడవద్దు -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాఘవాపూర్ వేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పెద్దపల్లి ప్రతినిధి: ప్రతిరోజూ పాఠశాలల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ పీరియడ్, లైబ్రరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రధానోపాధ్యా యులకు తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా సందర్శించారు. పాఠశాలకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ కు ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పాఠశాలను ఆసాంతం పరిశీలించిన కలెక్టర్ అమ్మ ఆదర్శ…

Read More

మల్లారెడ్డికి టీటీడీపీ బాధ్యతలు..? | TTDP responsibilities for Mallareddy..? | Eeroju news

హైదరాబాద్, జూన్ 12, (న్యూస్ పల్స్) తెలంగాణలో రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఫలితాలు తర్వాత ఊహించని మార్పులు వస్తాయని నేతలు బహిరంగంగా చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.దాదాపు ఆరుగురు నేతలు ఇప్పటికే అధినేత చంద్రబాబుతో మంతనాలు జరిపినట్టు అందులోని సారాంశం. అదే జరిగితే కారు పార్టీ ఖాళీ కావడం ఖాయమని చర్చించుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లపాటు పాలించింది టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ. అందులోని నేతలంతా దాదాపు టీడీపీ నుంచి వెళ్లినవారే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. బీఆర్ఎస్ బదులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈసారి బీఆర్ఎస్ నుంచి గెలిచినవాళ్లలో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లినవారు ఉన్నారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ప్రభుత్వం…

Read More