మంథని ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి దుద్దిల్ల శ్రీధర్ బాబు జన్మదినం సందర్భంగా మంథని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సురయ్య పల్లె గ్రామ ఐదో వార్డు సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎరుకల సురేష్ ఆధ్వర్యంలో బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి శ్రీధర్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రేపాక శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జంజర్ల మల్లేష్, మాజీ సర్పంచ్ మంథని కర్ణ కృష్ణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆర్ల వెంకన్న, నూకల బానయ్య, వార్డు సభ్యులు చెరుకు తోట శారద రమేష్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ల నాగరాజ్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెద్దపెల్లి జిల్లా చైర్మన్ అరేల్లి కిరణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జంజర్ల గట్టయ్య, ఆర్ల లింగయ్య, ఆర్ల జ్ఞాని, బొద్దుల సతీష్, కొరవేణ కృష్ణ, ఆర్ల నారాయణ, కడారి సతీష్, నూకల కమల్, తదితరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు.