Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మోడల్ స్కూల్ హాస్టల్లో సౌకర్యాలు కల్పించాలి ..

Facilities should be provided in model school hostels.

0
  • జ్వరాలు వచ్చిన పట్టించుకోవడం లేదని ఆరోపణ
  • మల్లాపూర్ లో విద్యార్థుల ధర్నా

మల్లాపూర్ మండలంలోని మోడల్ స్కూల్ హాస్టల్ లో సౌకర్యాలు కల్పించాలని. Model school students demand మోడల్ స్కూల్ విద్యార్థులు డిమాండ్ చేశారు.హాస్టల్ లో అపరిశుభ్రంగా ఉందని జ్వరాలు వచ్చిన పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపించారు బుధవారం మండల కేంద్రంలోని రహదారిపై ధర్నా నిర్వహించారు. సుమారు గంటకు పైగా ధర్నా నిర్వహించగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచి పోవడంతో విషయం తెలుసుకున్న ఎస్ ఐ నవీన్ కుమార్ ధర్నా ప్రాంతానికి చేరుకొని అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.

హాస్టల్ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని దీంతో గత వారం రోజులుగా జ్వరాలు వస్తున్నాయని విద్యార్థులకు వైద్యం అందించేందుకు వైద్యులు లేరని అన్నారు. విద్యార్థులు త్రాగేందుకు కనీసం నీళ్ళు కూడా లేవని ఎన్ని సార్లు అధికారులకు సమస్యను వివరించిన పట్టించుకోవడం లేదని అన్నారు.హాస్టల్ లో కనీస సౌకర్యాలు లేవని అధికారులు స్పందించి వైద్యురాలిని నియమించి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించాలని. హాస్టల్ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie