Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కాసేపట్లో బీఆర్ఎస్​ పార్టీ అభ్యర్థుల తొలి జాబిత ప్రకటన

The first list of BRS party candidates has been announced

0

బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా మధ్యాహ్నం 2.30 గంటలకు రిలీజ్ కానుంది. ఈ మేరకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ తుది జాబితా కసరత్తు పూర్తి చేశారు. ఈ తరుణంలో టిక్కెట్లు రావని ప్రచారం జరుగుతున్న పలువురు నేతలు పార్టీ ముఖ్య నేతలను ప్రసన్నం చేసు కునేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరి నిమిషం వరకు అభ్యర్థుల జాబితాలో తమకు అవకాశం దక్కేలా ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీశ్ రావు ఇంటికి పార్టీ నేతలు క్యూకట్టారు. టికెట్ రాదని ప్రచారం జరుగుతున్న సిట్టింగ్ శాసనసభ్యులతో పాటు టికెట్ ఆశిస్తున్న నేతలు వారితో భేటీ అవుతు న్నారు. ఇందులో భాగంగా సోమవారం ఎమ్మెల్సీ కవిత నివాసానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. ఎమ్మెల్సీ ఎల్ రమణలు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు జీవన్ లాల్, నర్సాపూర్ టికెట్ ఆశిస్తున్న సునీత లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితర నేతలు కవితను కలిశారు. తమకే టికెట్ దక్కేలా చూడాలని ఆమెను అభ్యర్థించారు.

ఆమె నుంచి స్పష్టమైన హామీ కూడా తీసుకున్నారు. రేఖానాయక్ కు ఈ దఫా టిక్కెట్టు రాదనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో ఆమె కవితతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరో వైపు ఉమ్మడి మెదక్ జిల్లాలోని నర్సాపూర్ కు చెందిన సునీతాలక్ష్మారెడ్డి సైతం కవితతో సమావేశమయ్యారు. నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి టిక్కెట్టు దక్కదని ప్రచారం సాగుతుంది. ఈ స్థానంలో సునీతాలక్ష్మారెడ్డికి చోటు దక్కే అవకాశం ఉందనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది. మరోవైపు జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా ఆమెతో సమావేశమయ్యారు.

జనగామ అసెంబ్లీ స్థానం నుంచి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని తప్పించి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి టిక్కెట్టు ఇస్తారనే ప్రచారం సాగుతుంది. అయితే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికే టిక్కెట్టు ఇవ్వాలని ఆయన అనుచరులు కోరుతున్నారు. మరో వైపు వైరా ఎమ్మెల్యే రాములునాయక్ | కుటుంబ సభ్యులు కవితతో సమావేశమయ్యారు. నేతలతో సమావేశం ముగిసిన తర్వాత కవిత ప్రగతి భవన్ కు చేరుకున్నారు. కవితను కలిసిన అనంతరం రేఖనాయర్. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హైదరాబాద్ లో ఉన్న మంత్రి హరీశ్ రావును కలిశారు. తమకే టికెట్ దక్కేలా చూడాలని ప్రాధేయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie