Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఎట్టకేలకు దాసోజు శ్రవణ్ కుపదవి

As the assembly elections are approaching, the Chief Minister has finalized the Governor's quota of MLCs in Telangana

0

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో Governor Quota MLC in Telangana తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి ఖరారు చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు దాసోజు శ్రవణ్‌తో పాటు, కుర్రా సత్యనారాయణలను ఎంపిక చేశారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌‌లను ఖరారు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సామాజిక సమీకరణలు, త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్‌ వీరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. మే నెలలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో చోటు దక్కించుకోవడం కోసం ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను సిఎం కేసీఆర్ ఖరారు చేశారు. దాదాపు రెండు నెలల కసరత్తు అనంతరం గవర్నర్‌ కోటాలో ఖాళీగా ఉన్న రెండు నామినేటెడ్‌ స్థానాలకు అభ్యర్థులను మంత్రిమండలి ఎంపిక చేసింది.మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బిఆర్‌ఎస్‌ నాయకుడు దాసోజు శ్రవణ్‌ల పేర్లను ఆమోదించింది. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో విస్తృతస్థాయి చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పదవీకాలం మే నెలాఖరుకే ముగిసింది.ఈ ఏడాది తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు జరుగుతుండటంతో అభ్యర్థుల ఎంపికపై అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయించారు. సామాజిక వర్గాల వారీగా అధ్యయనం చేసి ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు చెందిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్‌లను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్‌ నాయకుడైన సత్యనారాయణ బీజేపీపై అసంతృప్తితో బిఆర్‌ఎస్‌లో చేరారు. గతంలో కేసీఆర్‌తో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. Dasoju Shravan was recognized as a BC leader దాసోజు శ్రవణ్‌ బీసీ నేతగా గుర్తింపు పొందారు. నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడేనికి చెందిన దాసోజు శ్రవణ్‌ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా పనిచేశారు.2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున Secunderabad Lok Sabha Constituency Election సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరారు. క్రమంగా పొలిట్‌బ్యూరో సభ్యుని స్థాయికి ఎదిగారు. 2014లో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి 2022లో ఆగస్టులో బీజేపీలో చేరారు. కొద్ది నెలలకే అక్కడ ఇమడలేక ఆ పార్టీని వీడి మళ్లీ బిఆర్‌ఎస్‌లో చేరారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రవణ్‌కు మండలిలో చోటు కల్పించడం ద్వారా ఆ వర్గాలను ఆకట్టుకోవాలని బిఆర్‌ఎస్‌ అధి నాయకత్వం భావిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie