Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

మద్య నిషేధం అని చెప్పిన జగన్ లక్ష కోట్ల మద్యం అమ్మాడు వచ్చే ఎన్నికల్లో జగన్  ఓడాలి..రాష్ట్రం గెలవాలి  – చంద్రబాబు నాయుడు..

0

కృష్ణా జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్, అతని అనుచరులు, మద్దతు దారులు శుక్రవారం నాడు  టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత, నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని తెలుగు దేశం తప్ప ఎవరూ కాపాడలేరని పార్టీలోకి వచ్చిన సుభాష్ చంద్రబోస్ ను అభినందిస్తున్నా. అతనితో పాటు మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపిటిసిలు, ఇతర నేతలకు ఆహ్వానం. నేను ఒకటే చెపుతున్నా..వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి.  అప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది.

 

కరుడుగట్టిన నేరస్థుడిని నమ్మి సిఎంని చేసి ప్రజలు అంతా మోసపోయారు. నేను నా కోసం కాదు..రాష్ట్రం కోసం ఆలోచన చేస్తున్నా. పోలవరం పూర్తి అయ్యి ఉంటే రాష్ట్రం సుభిక్షం అయ్యేది. తెలంగాణకు హైదరాబాద్ ఉన్నట్లు..మనకు అమరావతి ఉండాలని ప్రయత్నించాను. రాజధాని కోసం భూములు తీసుకున్నాం..నిర్మాణాలు మొదలు పెట్టాం. జగన్ మూడు  రాజధానులు అని అమరావతిని ఆపేశాడు. విశాఖ ను ఎంత నాశనం చేశాడో చూశాం కదా. అమరావతి పూర్తి అయ్యి ఉంటే మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు వచ్చేవి..కానీ నేడు ఆ పరిస్థితి లేదు. కృష్ణా డెల్లాకు నీటి కష్టాలు లేకుండా పట్టిసీమ కట్టాను. పొలవరం కట్టడానికి 5 ఏళ్లు పడుతుంది అని..ఏడాదిలో పట్టిసీమ పూర్తి చేశాను. నీళ్లు ఇచ్చాను.

 

నేను తెచ్చిన పట్టిసీమ నీళ్లు తాగారు కానీ నన్ను మీరు మరిచిపోయారు. కృష్ణ, గోదావరి నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు అని ప్రణాళికలు సిద్దం చేశాం. ఒక అసమర్థుడు, అవినీతి పరుడు సిఎం అయితే ఏమవుతుందో పోలవరం చూస్తే అర్థం అవుతుంది. పోలవరంలో నిర్మాణ సంస్థలను, అధికారులను మార్చి ప్రాజెక్టుకు నష్టం చేశారని ఆరోపించారు. డయాఫ్రం వాల్, గైడ్ బండ్ దెబ్బతిన్నాయి..దీనికి కారణం ఏంటి. 5 ఏళ్లు మనం పడిన కష్టం అంతా బూడిదపాలు అయ్యింది. పోలవరం పోయింది..అమరావతి పోయింది. రాష్ట్రంలో ఇప్పుడు ఒక్క రోడ్డుకూడా బాలేదు..నేషనల్ హైవేలు ఎలా ఉన్నాయి..రాష్ట్ర రహదారులు ఎలా ఉన్నాయి..చూడండి. వాతావరణ పరంగా మన దగ్గర ఎండలుఎక్కువ ఉంటాయి.

పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు మానాలి.

దీన్ని సోలార్ ఎనర్జీ గా ఉపయోగించుకుంటే విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఉండదని అన్నారు. జగన్ ప్రభుత్వం 8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. ఇది గమనించే నాడు సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించాం.  మనం అధికారంలో ఉండి ఉంటే విద్యుత్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఉండేది కాదు. సోలార్ విద్యుత్ ద్వారా మోటార్ దగ్గరే విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. సోలార్ విద్యుత్ ను మళ్లీ ప్రమోట్ చేసి ప్రజలపై విద్యుత్ భారం లేకుండా చేస్తాం.
ఈ ప్రభుత్వం మొటార్లకు మీటర్లు పెట్టి..రైతులకు ఉరితాళ్లు వేసింది.

 

రాష్ట్రంలో వైసీపీకి అధికారంతో బాగుపడింది ఒకే ఒక్కడు..అదే జగన్. నాడు మద్య పాన నిషేదం అన్నాడు..లక్ష కోట్ల మద్యం అమ్మాడు..ఈ సిఎంను ఏమనాలి?  మద్యం షాపుల్లో ఆన్లైన్ పేమెంట్లు ఎందుకు అనుమతించడం లేదు? ఇలాంటి సిఎంను ఓడించడానికి..అన్ని వర్గాలు కలిసి రావాలి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి. సైకో పోవాలి..సైకిల్ రావాలి. అప్పుడే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఉపసభాపతి, మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie