స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు బీసీల పట్టు ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో తెలంగాణ బంద్‌కు పిలుపు రాష్ట్రవ్యాప్తంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో తెలంగాణలో ఈరోజు బంద్ కొనసాగుతోంది. బీసీ సంఘాలు ‘బంద్ ఫర్ జస్టిస్’ పేరుతో ఇచ్చిన పిలుపునకు రాష్ట్రవ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. బంద్ ప్రభావంతో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోగా, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు సైతం ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బంద్‌లో భాగంగా బీసీ సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు తెల్లవారుజామున 4 గంటల నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించి నిరసనలకు దిగారు. దీంతో ఒక్క బస్సు కూడా డిపోల నుంచి బయటకు రాలేదు. రాజధాని హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్ సహా రాజేంద్రనగర్,…
Read More