రేపు తిరుపతి వస్తున్న సీఎం చంద్రబాబు ఎస్వీ అగ్రి కాలేజి వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు హెలిప్యాడ్ వద్ద 5 బాంబులు అమర్చినట్టు ఈమెయిల్ బెదిరింపు తిరుపతిలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరం ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీకి బాంబు బెదిరింపు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కోసం కళాశాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద 5 ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు పెట్టినట్లు బెదిరింపు ఈ-మెయిల్లో పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాంబు స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. కాలేజీ వద్ద, ముఖ్యంగా హెలిప్యాడ్ పరిసర ప్రాంతాల్లో అణువణువునా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. కుటుంబ కార్యక్రమం కోసం సీఎం పర్యటన ఒక కుటుంబ పరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబం వారి స్వగ్రామం నారావారిపల్లెకు వస్తోంది. మంత్రి నారా లోకేశ్, నారా భువనేశ్వరి ఈ సాయంత్రం నారావారిపల్లె…
Read More