ఈసారి ఫిబ్రవరి చివరిలోనే ఇంటర్ వార్షిక పరీక్షలు జేఈఈ, నీట్ ప్రిపరేషన్‌కు సమయం ఇచ్చేలా ప్రణాళిక ప్రభుత్వ ఆమోదం కోసం రెండు షెడ్యూళ్లు పంపిన బోర్డు ఇది తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అత్యంత కీలకమైన అప్డేట్. రాష్ట్రంలో వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు (BIE) మార్చడానికి సిద్ధమైంది. జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలైన జేఈఈ, నీట్ వంటి వాటికి విద్యార్థులకు తగినంత సమయం లభించాలనే ఉద్దేశంతో, ఈసారి ఫిబ్రవరి చివరి వారం నుంచే ఇంటర్ పరీక్షలు ప్రారంభించాలని బోర్డు యోచిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 2026 ఫిబ్రవరి 23 లేదా 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభించేందుకు వీలుగా రెండు వేర్వేరు టైమ్‌టేబుళ్లను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ బాధ్యతలను…
Read More