SupremeCourt : వీధికుక్కల నియంత్రణపై నివేదికలు ఇవ్వని రాష్ట్రాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం.

Your Negligence is Hurting India's Image!" – SC Fumes at States Over Stray Dog Crisis.

సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సూచన ప్రజల భద్రత, జంతువుల హక్కుల మధ్య సమతుల్యం అవసరమన్న కోర్టు బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసిన ధర్మాసనం వీధి కుక్కల సమస్యను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమస్యపై తీసుకున్న చర్యలకు సంబంధించి నివేదికలు దాఖలు చేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాష్ట్రాల నిర్లక్ష్యం కారణంగా దేశానికి చెడ్డపేరు వస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల బెడద, వాటి దాడులకు సంబంధించిన అనేక పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఈ విచారణ సందర్భంగా, చాలా రాష్ట్రాలు ఇప్పటికీ చర్యల నివేదికలను సమర్పించకపోవడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. “వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంది. ఈ విషయంలో మీరేం చర్యలు తీసుకున్నారో చెప్పడానికి…

Read More

Telangana : టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట: గ్రూప్ 1 వివాదంపై సంచలన తీర్పు

TGPSC Gets Relief from High Court in Group 1 Dispute

టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించిన హైకోర్టు తదుపరి విచారణ వచ్చే నెల 15కు వాయిదా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 వివాదంపై హైకోర్టు డివిజనల్ బెంచ్ సంచలన తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. గ్రూప్ 1 పరీక్షపై అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు సింగిల్ బెంచ్ విచారించింది. తుది మార్కుల జాబితా, జనరల్ ర్యాంకింగ్స్‌ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై టీఎస్‌పీఎస్సీ హైకోర్టులో అప్పీల్ చేయగా డివిజనల్ బెంచ్ ఈ రోజు విచారించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ…

Read More