చంద్రబాబు ప్రమాణస్వీకారం నారా చంద్రబాబు నాయుడు అనే నేను… | Chandrababu’s oath taking I am Nara Chandrababu Naidu… | Eeroju news

అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు, రాష్ట్రవిభజన తరువాత రెండు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అరుదైన ఘనతను సాధించారు. మొన్నటి వరకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చరిత్రను తిరగరాస్తూ తాజా గా నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఏపీ ముఖ్యమంత్రిగా ఉదయం 11.27 నిమిషాలకు సింహలగ్నంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకార మహోత్సవానికి దేశ ప్రధాని మోదీతో పాటు ముఖ్యశాఖల కేంద్ర మంత్రులు హాజరయ్యారు. 2014లో తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏపీ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్ష నేతగా ప్రజల్లో తిరుగుతూ వారి కష్టసుఖాల్లో పాల్పంచుకున్నారు. 2024లో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సంచ లన విజయాన్ని సాధించి నాలుగోసారి ముఖ్యమంత్రి…

Read More

మల్లారెడ్డికి టీటీడీపీ బాధ్యతలు..? | TTDP responsibilities for Mallareddy..? | Eeroju news

హైదరాబాద్, జూన్ 12, (న్యూస్ పల్స్) తెలంగాణలో రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఫలితాలు తర్వాత ఊహించని మార్పులు వస్తాయని నేతలు బహిరంగంగా చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్న చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.దాదాపు ఆరుగురు నేతలు ఇప్పటికే అధినేత చంద్రబాబుతో మంతనాలు జరిపినట్టు అందులోని సారాంశం. అదే జరిగితే కారు పార్టీ ఖాళీ కావడం ఖాయమని చర్చించుకుంటున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లపాటు పాలించింది టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ. అందులోని నేతలంతా దాదాపు టీడీపీ నుంచి వెళ్లినవారే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. బీఆర్ఎస్ బదులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈసారి బీఆర్ఎస్ నుంచి గెలిచినవాళ్లలో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్లినవారు ఉన్నారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ప్రభుత్వం…

Read More

మున్నేరు రిటర్నింగ్ వాల్ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి | Minister Ponguleti inspected the Munneru Returning Wall works | Eeroju news

ఖమ్మం ఖమ్మం జిల్లా దానవాయిగూడెంలో మున్నేరు రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులను తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు.  ఈ సందర్భంగా అధికారులతో మంత్రి మాట్లాడుతూ – యుద్ధప్రాతిపదికన పనులను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ప్రతిభావంతులైన వర్కర్లను నియమించి  పనుల్లో లోపాలు తలెత్తకుండా చూడాలి. ఇప్పటికే నాలుగు నెలల సమయం వృధా అయింది…ఫుల్ టైం నిర్మాణ పనులను చేపట్టి త్వరగా పూర్తి చేయండి.  పదిరోజుల్లో మళ్ళీ వస్తా… పనుల్లో పురోభివృద్ధి లేకపోతే బాధ్యుల పై చర్యలు…. పనుల్లో నాణ్యత లోపించిన ఊరుకునేది లేదు.  రెవెన్యూ అధికారులు మున్నేరు కు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ఇరిగేషన్ అధికారులకు అప్పగించండి. గోళ్ళపాడు సైడ్ డ్రెన్ల మాదిరిగా మున్నేరు సైడ్ డ్రైన్ లను నిర్మించండి.  స్టార్టింగ్ పాయింట్… ఎండింగ్ పాయింట్…

Read More

ఏపీలో కాంగ్రెస్ కోలుకోనేదే లేదా | Congress will not recover in AP | Eeroju news

ఏపీలో కాంగ్రెస్ కోలుకోనేదే లేదా కడప, జూన్ 12, (న్యూస్ పల్స్) Congress will not recover in AP వైఎస్ షర్మిల.. రాజన్న బిడ్డనంటూ జనంలోకి వచ్చారు. అయితే జనం నుంచి మాత్రం ఆదరణ పొందలేకపోయారు. తనతో పాటు తన కుటుంబ పరువును పోగొట్టారు. వైఎస్ కుటుంబ సభ్యులకు ఓటమే తెలియని కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయి నవ్వుల పాలయ్యారు. ఆమె ఈ ఎన్నికను ఈజీగా తీసుకోవచ్చు కానీ.. కడప చరిత్రలో ఆమె కుటుంబ చరిత్రకు ఒక రెడ్ మార్క్ ను పెట్టేశారనే అనాలి. గెలుస్తానన్న విశ్వాసమో.. లేక అతి విశ్వాసమో తెలియదు కానీ కడప పార్లమెంటు నియోజకవర్గం ఎంచుకుని పీసీసీ చీఫ్ గా ఉండి ఓటమి పాలు కావడంతో పాటు ఒక్క స్థానంలోనూ గెలవకపోవడంతో ఆమె…

Read More